శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (15:18 IST)

వరుణ్‌తో నిశ్చితార్థం.. హైదరాబాద్‌లో షూటింగ్ స్పాట్‌లో త్రిష!

తమిళ యువ పారిశ్రామికవేత్త, చిత్ర నిర్మాత అయిన వరుణ్ మణియన్‌తో ఈనెల 23వ తేదీన నిశ్చితార్థం చేసుకున్న చెన్నై చిన్నది త్రిష... ఇపుడు హైదరాబాద్‌లో హల్‌చల్ చేస్తోంది. ఒక చిత్ర షూటింగ్ నిమిత్తం ఆమె హైదరాబాద్‌కు వచ్చింది. 
 
తాజాగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'లయన్‌' చిత్రం షూటింగ్‌లో కీలక సన్నివేశాలు హైదరాబాద్‌ శివార్లో జరుగుతోంది. అక్కడ గురువారం షూటింగ్‌లో పాల్గొనడానికి వచ్చింది. ఇందులో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ప్రకాష్‌రాజ్‌, త్రిష, జయసుధ ముఖ్య సన్నివేశాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ సినిమాను సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు.