1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (12:31 IST)

ఉత్తమ విలన్: ఏప్రిల్ 2న ఆడియో, మార్చి 1న సినిమా!

దశావతారం కమల్ హాసన్ ఉత్తమ విలన్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ సినిమాను ఏప్రిల్ 2న, ఆడియోను మార్చి ఒకటో తేదీన విడుదల చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. 
 
ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన లింగుస్వామి ట్విట్టర్ ద్వారా చెప్పారు. కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు ఈ సినిమాలో కమల్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కళాకారుడి పాత్రను కమల్ హాసన్ పోషిస్తున్నారు. 
 
విశ్వరూపంలో కమల్ సరసన కీలక పాత్ర పోషించిన ఆండ్రియా ఈ సినిమాలో కూడా నటించింది. కమల్ సినీ గురువు, దర్శకుడు కె. బాల చందర్ ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్రను పోషించారు.