శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (15:06 IST)

వర్మ ఆక్షన్‌ పద్ధతి ఫూలిష్‌ లాంటిది... హృదయకాలేయం డైరెక్టర్

ఇటీవల సినిమాలను విడుదల చేస్తూ డిస్ట్రిబ్యూటర్ల స్థానంలో ప్రజలను భాగస్వాముల్ని చేసే పద్ధతి ప్రవేశపెడుతూ రాంగోపాల్‌ వర్మ కొత్త ప్రయోగం చేశాడు. తన సినిమా 'ఐస్‌క్రీమ్‌' సినిమా ప్రమోషన్‌లో భాగంగా దీన్ని తెరపైకి తెచ్చాడు. ఈ ప్రయోగం చాలా వుపయోగమనీ, దాసరి నారాయణరావు, మంచు మోహన్‌ బాబు కూడా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అయితే దీనిద్వారా ఎగ్జిబిటర్లు ఎలా వస్తారనేది మాత్రం చెప్పలేదు. అది పెద్ద సమస్య కాదని వివరించారు. కానీ ఈ పద్ధతి చాలా ఫూలిష్‌ అని అనుభవపూర్వకంగా చెబుతున్నానని... 'హృదయ కాలేయం' దర్శకుడు రాజేష్‌ తెలియజేస్తున్నారు.
 
ఆయన స్నేహితుడు తీసిన 'భూ' అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఎనిమిది నెలలపాటు ఈ చిత్రం విడుదల కాకుండా ఆగిపోయింది. సినిమాను వర్మ ఇచ్చిన స్ఫూర్తితో బయటపెట్టాలని ఆక్షన్‌ పద్ధతిలో వెళ్ళాను. కానీ అ పద్ధతిలో చాలా లొసుగులు కన్పించాయి. 
 
ప్రజల్ని ఏదో ఒక ఏరియాను భాగస్వామి చేసి వారు కొన్నట్లుగా వారికి ప్రింట్‌ ఇస్తే.. థియేటర్‌ ఎవరిస్తారు. థియేటర్‌ ఇచ్చినా.. డైరీ కలెక్షన్‌ రిపోర్ట్‌ ఎవ్వరూ ఇవ్వరు. ఇవన్నీ ఎగ్జిబిటర్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో... అనవసరపు ప్రయాసగా కొట్టిపారేశారు. కొంతంది తమ చిత్రాలను పబ్లిసిటీ చేసుకోవడానికి ఏదేదో కొత్త పద్ధతి అని చెప్పి మోసం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గ్రహించాలని చెప్పారు.