శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2014 (14:31 IST)

'కత్తి' విడుదల రోజున విషాదం : వీరాభిమాని దుర్మరణం!

తమిళ హీరో విజయ్ కొత్త చిత్రం "కత్తి" విడుదల సందర్భంగా ఓ విషాదం చోటు చేసుకుంది. హీరో విజయ్ కటౌట్‌కు పాలాభిషేకం చేస్తూ ఓ అభిమాని ప్రమాదవశాత్తు కిందపడటంతో దుర్మరణం పాలయ్యాడు. పాలక్కాడులో ఈ ప్రమాదం చోటు చేసుకోగా మృతి చెందిన అభిమాని పేరు ఉన్ని కృష్ణన్‌ (23)గా గుర్తించారు. వెల్డర్‌గా పనిచేసే ఉన్నికృష్ణన్ విజయ్‌కి వీరాభిమాని. విజయ్ అభిమాన సంఘం కార్యకలాపాల్లో ఈ యువకుడు ఎంతో చురుగ్గా పాల్గొనేవాడు. అదేవిధంగా కత్తి చిత్రం విడుదల రోజున భారీ కటౌట్ ఏర్పాటు చేసి, ఆ కటౌట్‌కు పాలభిషేకం చేస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. 
 
కాగా, ఏఆర్ మురుగదాస్ డైరక్షన్లో తెరకెక్కిన 'కత్తి' సినిమా తీవ్ర అవాంతరాల నడుమ విడుదలైన విషయం తెల్సిందే. తమిళనాట పలు సంఘాలు ఈ సినిమాపై అభ్యంతరం చెప్పాయి. విడుదలకు తాము అంగీకరించబోమని హెచ్చరించాయి. ఈ సినిమా నిర్మాతకు శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సేకు సంబంధాలున్నాయంటూ తమిళ సంఘాలు ఆరోపించాయి. దీంతో నిర్మాణ సంస్థ తమిళ సంఘాల ప్రతినిధులు ఆందోళన మేరకు వెనక్కి తగ్గి కొన్ని పేర్లను తొలగించడంతో ఈ చిత్రం సాఫీగా విడుదలైంది.