1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 3 మార్చి 2015 (19:14 IST)

పెళ్లికి ముందు యువత తప్పులు... యవ్వనం ఒక ఫాంటసీ...

'పెళ్లికి ముందు యువత చేసిన తప్పులు పెళ్లయిన తర్వాత వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, వాటి తాలూకు పరిణామాలు ఎలా వుంటాయి, వాటి నుంచి తప్పించుకోవడానికి హీరో చేసిన ప్రయత్నాలేమిటి అన్న కాన్సెప్ట్‌తో 'యవ్వనం ఒక ఫాంటసీ' రూపొందుతోంది. దర్శక నిర్మాత ప్రసాద్‌ నీలమ్‌.
 
అరవింద్‌కృష్ణ తొలిసారిగా ఈ చిత్రంలో ప్లేబోయ్‌గా నటిస్తూ చక్కటి పెర్ఫామెన్స్‌ కనబరిచారు.  'ప్రతినిధి' ఫేం శుభ్ర అయ్యప్ప అందం, అభినయం ఆకట్టుకుంటాయి. అలాగే జీవన్‌థామస్‌ సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతం ఈ చిత్రం రీ-రికార్డింగ్‌ జరుపుకుంటోంది. ఈ నెలాఖరులో ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.