1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By SELVI.M

"డాన్ శ్రీను"గా మారబోతున్న దుబాయ్ శ్రీను!?

WD
అందాలతార నయనతారతో జతకట్టి "దుబాయ్‌శ్రీను"గా పేరుతెచ్చుకున్న మాస్ హీరో రవితేజ.. తాజాగా "డాన్ శ్రీను"గా మారబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించిన దుబాయ్‌శీను తరహాలోనే ఆర్.ఆర్. మూవీ మేకర్స్ మళ్లీ రవితేజతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ సినిమాలో అరుంధతి తార బొమ్మాళీ అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా గోపిచంద్ మలినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో రియల్ స్టార్, డాక్టర్. శ్రీహరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
 

ఇంకా ఈ సినిమాలో రవితేజ డాన్‌గా వైవిధ్యమైన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇకపోతే.. ఈ సినిమాకు "డాన్ శ్రీను" అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

దుబాయ్ శీను, కిక్, ఆంజనేయులు వంటి హిట్ చిత్రాల తర్వాత రవితేజకు "డాన్ శ్రీను" కూడా మంచి పేరు సంపాదించి పెడుతుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అలాగే.. సెక్సీడాళ్, బిల్లా సుందరి అనుష్క.. "బలాదూర్" తర్వాత రవితేజ సరసన నటించడం కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.