ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By SELVI.M
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (20:57 IST)

తమిళ హీరో జైకు అక్కలా కనిపించిన రిచా గంగోపాధ్యాయ!!

తమిళ హీరో జైకు మిరపకాయ్ భామ రిచా గంగోపాధ్యాయ అక్కలా కనిపించిందట. ఇంతకీ ఈ జై ఎవరబ్బా అనుకుంటున్నారా.. అదేనండీ జర్నీ సినిమా హీరో. తెలుగులో నితిన్ హీరోగా నటించే కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాన్ని తమిళంలో తమిళ్‌సెల్వనుం.. తనియార్ అంజలుం పేరిట తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాలో జై సరసన నటించేందుకు హీరోయిన్ల ఎంపిక కోసం ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ మల్లగుల్లాలు పడుతున్నాడు. కొరియర్ బాయ్ కళ్యాణ్ తమిళ వెర్షన్‌లో తొలుత అభినయను కథానాయికాగా ఎంపిక చేశారు. కానీ కాల్షీట్ సమస్యతో ఆమె తప్పుకోవడంతో.. రిచాను సెలక్ట్ చేశారు.

కానీ రిచా గ్లామర్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ ఆమె బొద్దందాలతో జైకు అక్కలా కనిపించిందట. దీంతో రిచాను కూడా పక్కన బెట్టేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్. అయితే ధనుష్‌కి సరసన "మయక్కం ఎన్న" అనే తమిళ చిత్రంలో నటించిన ఈ భామ ఎత్తుగా ఫిట్‌గా కనిపించే జై సరసన మాత్రం ఎందుకు సరిపోదని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇంకా రిచాను పక్కన బెట్టేందుకు ఇది సరైన కారణం కాదని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.