టాలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో కట్టి పడేస్తున్న అందాలముద్దుగుమ్మ, పొడవుకాళ్ల సుందరి ఇలియానా ఈ మధ్య వై.వి.ఎస్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు ఫిలిమ్ నగర్‌లో వినిపిస్తున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమకు "దేవదాసు" చిత్రం ద్వారా ఇలియానాను వై.వి.ఎస్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నుంచి ఇలియానా, వైవిఎస్‌తో ప్రేమాయణం కొనసాగిస్తుందని, ఇంకా వీరిద్దరి మధ్య డేటింగ్ కూడా జరుగుతుందని సినీ జనం చెవులుకొరుక్కుంటున్నారు.
విష్ణువర్ధన్, ఇలియానాలు జంటగా నటించిన "సలీమ్" చిత్ర ఆడియో వేడుకలో ఇలియానాపై వై.వి.ఎస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమెను శ్రీదేవి, సిమ్రాన్‌లతో పోల్చి మునగచెట్టు ఎక్కించేశాడు. ఇదంతా ఇలియానాపై ఉన్న ప్రేమతోనే వై.వి.ఎస్. మాట్లాడినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇలియానా కూడా టాలీవుడ్‌లో తానొకరిని ప్రేమిస్తున్నానని తన సన్నిహితుల దగ్గర చెబుతోందట. అంతేకాదు.. ఇలియానా, వై.వి.ఎస్ మాటలు చూస్తుంటే వీరిద్దరి మధ్య ఎఫైర్ కొనసాగుతోందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.