"ఏదైనా డబ్బులు పెట్టి కొనుక్కుని తింటే అంత రుచిగా ఉండదు. దొంగలించి తింటే ఆ రుచేవేరుగా ఉంటుందనే సూత్రాన్ని తెల్లపిల్ల, దేశముదురు భామ హన్సిక వల్లెవేస్తోంది. అలా అని మీరంతా ఆ పని చేయకండి.. అసలుకే మోసం వస్తుంది.
నేనేదో చిన్నప్పుడు పక్కపినీసులు, ఇంట్లో వక్కపొడి దొంగలించేదాన్ని. అలాగే స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళితే.. వారు తింటున్న రుచికరమైన ఐటంను వారిని మాటల్లో పెట్టి తినేసేదాన్ని.. అలా దొంగలించి తినేవి మహారుచిగా ఉంటాయని" హన్సిక చెప్పుకొచ్చింది.
అల్లు అర్జున్ సరసన దేశముదురులో బ్యూటీ గర్ల్‌గా పరిచయమై.. టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న హన్సిక తాజాగా నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన "జయీభవ" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌లో కూడా ఏదైనా దొంగలించేద్దామనుకున్నా.. కానీ కుదరలేదని నిర్మొహమాటంగా చెప్పింది.
కానీ నా నుంచి ఒకటి దొంగలించబడిందని హన్సిక తెలివిగా సమాధానమిచ్చింది. అదేమిటంటే..? నా మనసును హీరో దొంగలించాడు. అది ఎట్లా అనేది సినిమాలో చూసి థ్రిల్ కావాల్సిందేనని హన్సిక ట్విస్ట్ పెట్టింది.
ఇక నిజజీవితంలో మీ మనసు ఎవరినైనా దొంగలించిందా? లేదా మీరెవరినైనా దొంగలించారా? అన్న ప్రశ్నకు.. సింపుల్‌గా నవ్వుతూ.. ఇంకా అంతవరకు రాలేదని హన్సిక స్పష్టం చేసింది. ఎలాగైనా హన్సిక హన్సికే...!.