1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By SELVI.M

ప్రభుదేవా లవర్ నయనతారనా? నేనెందుకు కాకూడదు..?

ప్రభుదేవా లవర్ ఎవరని అడిగితే సినీ ప్రియులంతా ఒక్కసారిగా సెక్సీతార నయనతార పేరునే చెప్పేస్తారు. ఎందుకంటే..? ఇటీవల ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా-నయనతారతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో.. నయనతార ప్రభుదేవా.. లవ్వారా? నేనెందుకు కాకూడదని భూమిక ముందుకొచ్చిందట.. ఇదేదో నిజంగా భూమిక ప్రభుదేవాను ప్రేమిస్తుందా? అనుకుంటే పప్పులో కాలిసినట్టే..!.

పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా? వంటి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ప్రభుదేవా.. కోలీవుడ్‌లోనూ దర్శకత్వ శాఖలో రాణించేందుకు సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా తెలుగు పోకిరిని తమిళంలో రీమేక్ చేశారు.

తాజాగా మళ్లీ నటుడిగా ప్రేక్షకుల మార్కులు కొట్టేయాలని ప్రభు భావిస్తున్నారట. దీనికోసం వైవిధ్యమైన ప్రేమకథాంశాన్ని ప్రభుదేవా ఎంచుకుని తానే హీరోగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ప్రభుదేవా ప్రేయసిగా నటించేందుకు అందాల తార భూమికా చావ్లా అంగీకరించినట్లు సమాచారం. కోలీవుడ్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు తంగర్ బచ్చన్ రూపొందింస్తున్నట్లు తెలిసింది.