1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

షారుక్ సరసన నేను నటించను: అసిన్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఛాన్స్ వస్తే ఏ హీరోయినైనా వదులుకుంటుందా...? ఎగిరి గంతేయదూ...? కానీ సెక్సీ లిప్స్ బ్యూటీ అసిన్ మాత్రం షారుక్ జోడీగా నటించనని తెగేసి చెప్పిందట. "హ్యాపీ న్యూ ఇయర్" పేరుతో ఫరాఖాన్ రూపొందించనున్న చిత్రంలో షారుక్ సరసన నటించే అవకాశాన్ని ఇస్తామంటే అసిన్ తిరస్కరించిందట. 

అసిన్ తిరస్కారం వెనుక సల్మాన్ ఖాన్ హస్తం ఉందని బాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. సల్మాన్ ఎంత చెపితే అంత అన్నట్లుగా అసిన్ వ్యవహారశైలి ఉంటోందన్న వార్తలు అప్పట్లో వినిపించాయి కూడా. సల్మాన్ ఖాన్‌తో "లండన్ డ్రీమ్స్" చిత్రం చేస్తుండంతో డేట్స్ సమస్య వచ్చి షారుక్ సరసన నటించేందుకు తిరస్కరించినట్లు కొందరు చెపుతున్నారు.

ఏదేమైనా అసిన్- సల్మాన్ ఫ్రెండ్‌షిప్ చాలా దృఢంగా మారిందని బాలీవుడ్ సినీజనం అంటున్నారు. ఈ స్నేహం ఎంతవరకు వెళుతుందో చూడాలి.