1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

సక్సెక్ "కిక్"లో ఇలియానా: "రెచ్చిపో"తున్న పారితోషికం

తెలుగువారు తనకు కావలసినంత పారితోషికాన్ని అడగక ముందే పెంచేస్తున్నారనీ, టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం తను వదులుకోలేననీ బక్కపలచని భామ ఇలియానా అంటోంది. బాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తున్నా.. వాటిని నిరాకరిస్తున్నాని చెపుతోందీ పర్ఫెక్ట్ బ్యూటీ. 

శరీరానికి అంటుకుపోయే బిగుతు దుస్తులు ధరిస్తూ, ఎద పొంగులను అలవోకగా ప్రదర్శిస్తూ టాలీవుడ్ కుర్రకారు హృదయాలలో గిలిగింతలు పెట్టే ఈ భామ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశాన్ని సైతం తిరస్కరించిందట. దీంతో తమిళ నిర్మాతలు ఇలియానాకు పొగరు కాస్త ఎక్కువ అని వారిలో వారు అనుకుంటున్నారట.

తమిళంలో అంతకుముందు తెల్లపిల్ల తమన్నాతో కలిసి హీరో రవికృష్ణ సరసన నటించిన చిత్రం తమిళనాడు బాక్సాఫీసుల వద్ద బోర్లా పడింది. ఆ చిత్రంలో నటించిన బక్క పిల్ల ఇలియానాను తమిళ కుర్రకారు అస్సలు పట్టించుకోలేదట. తమన్నా అంటే చొంగ కార్చుకోవడం మొదలుపెట్టారట. ఈ పరిస్థితిని గమనించిన ఇలియానా, ఇక తను కోలీవుడ్‌లో వుంటే తన కెరీర్ మటాష్ అవుతుందని భయపడి తిరిగి టాలీవుడ్‌లో స్థిరపడినట్లు కృష్ణనగర్ సినీ వర్గాలు చెపుతున్నాయి.