శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మే 2023 (12:53 IST)

"బ్రో'' అంటోన్న పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్?

pawan-sai tej
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కథానాయకులుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రచన చేశారు. 
 
జులై 28న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతున్న ఈ సినిమా పేరు ఇంకా ఖరారు కాలేదు. 'బ్రో' అనే పేరుని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
pawan-sai tej
నవతరం సోదరభావంతో పిలుచుకునే మాట అది. ట్రెండీగా ఉన్న పదం కావడం, సినిమాలోనూ ఆ ప్రస్తావన ఉండటంతో దానివైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.  
 
మరోవైపు సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ఓజీ. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ పూర్తయినట్టు చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని డి. వి. వి. దానయ్య నిర్మిస్తున్నారు.