ప్ర‌కాష్ రాజ్, అనుప‌మ మ‌ధ్య గొడ‌వ... అస‌లు ఏం జ‌రిగింది..?

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, స‌క్స‌స్‌ఫుల్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌లిసి హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే సినిమాలో న‌టిస్తున్నారు. రామ్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకి న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంక‌టేశ్వ‌ర

PrakashRaj-Anupama
srinivas| Last Modified శనివారం, 7 జులై 2018 (16:00 IST)
విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, స‌క్స‌స్‌ఫుల్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌లిసి హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే సినిమాలో న‌టిస్తున్నారు. రామ్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకి న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే... ప్ర‌కాష్ రాజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య గొడవ జ‌రిగింది అనేది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. 
 
ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగింది అంటే... ప్ర‌కాష్ రాజ్, అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ ఇద్ద‌రు తండ్రీకూతురుగా న‌టిస్తున్నారు. ఓ సీన్‌లో ప్ర‌కాష్ రాజ్ డైలాగ్ చెప్పిన త‌ర్వాత అనుప‌మ డైలాగ్ చెప్పాల‌ట‌. అయితే... ప్ర‌కాష్ రాజ్ డైలాగ్ చెప్పిన త‌ర్వాత అనుప‌మ డైలాగ్ చెప్ప‌డం లేట్ అయ్యింద‌ట‌. దీంతో అనుప‌మ‌కి డైలాగ్ చెప్పే విష‌యంలో ప్ర‌కాష్ రాజ్ కాస్త క్లాస్ తీసుకున్నార‌ట‌. అంతే.. అనుప‌మ‌కి కోపం వ‌చ్చింద‌ట‌. చైర్‌లో కూర్చొని ఏడ్చేసింద‌ట‌. ఆ త‌ర్వాత ప్ర‌కాష్ రాజ్ అక్క‌డ నుంచి వెళ్లిపోయాడ‌ట‌. దీంతో ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింద‌ట‌. అదీ సంగ‌తి..!దీనిపై మరింత చదవండి :