బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 11 జులై 2017 (13:12 IST)

హీరో దిలీప్ మామూలోడు కాదు... నటి భావన లొంగనందుకే లైంగిక దాడి...

నటి భావనపై మలయాళ హీరో దిలీప్‌కు వ్యక్తిగత కక్ష ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా.. మలయాళ చిత్ర పరిశ్రమ మొత్తం తన గుప్పెట్లో ఉంటే.. భావన మాత్రం హీరో దిలీప్ చేతికి చిక్కలేదు. దీంతో ఆమెను ఎలాగైనా తన బందీగా చేసు

నటి భావనపై మలయాళ హీరో దిలీప్‌కు వ్యక్తిగత కక్ష ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా.. మలయాళ చిత్ర పరిశ్రమ మొత్తం తన గుప్పెట్లో ఉంటే.. భావన మాత్రం హీరో దిలీప్ చేతికి చిక్కలేదు. దీంతో ఆమెను ఎలాగైనా తన బందీగా చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఇందులోభాగంగా, తొలుత ఆమె సినీ కెరీర్‌ను నాశనం చేయాలని ప్లాన్ వేశాడు. గత రెండేళ్లుగా అతని ప్లాన్ విఫలమవుతూ వచ్చింది. చివరకు ఈ యేడాది ఫిబ్రవరి నెల 17వ తేదీన తాను అనుకున్నట్టుగానే లైంగికదాడి జరిపించాడు. ఈ విషయం భావన లైంగికదాడి కేసులో పోలీసు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు పల్సర్ సునీ వద్ద జరిపిన సుదీర్ఘ విచారణలో తేటతెల్లమైంది.
 
గత ఫిబ్రవరి 17వ తేదీన షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న నటి భావనపై కొందరు వ్యక్తులు లైగింక దాడికి పాల్పడగా, ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెల్సిందే. దాదాపు ఐదు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు చేస్తున్న దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం అనుమానితుడుగా ఉన్న ప్రముఖ నటుడు దిలీప్‌ను కేరళ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు.
 
ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీతో దిలీప్ మంతనాలు జరిపినట్లు పక్కా ఆధారాలు లభించడంతోనే దిలీప్‌ను అరెస్టు చేసినట్లు డీజీపీ లోక్‌నాథ్ బెహ్రా స్పష్టంచేశారు. జూన్ 28న పల్సర్ సునీని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు అతడి నుంచి చాలా విషయాలు రాబట్టారు. దిలీప్ సినిమా షూటింగ్ స్పాట్లకు సునీ చాలా సార్లు వెళ్లి, అతడిని కలిసినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు.
 
ముఖ్యంగా నటి భావనపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే ఆమె కెరీర్‌ను నాశనం చేయాలని రెండేళ్ల నుంచి దిలీప్ ప్లాన్ చేసినట్లు విచారణలో బయటపడింది. అందుకోసం సునీకు దిలీప్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో బయటపడింది. సునీతో పాటు మరో నిందితుడు జిన్సన్ స్టేట్‌మెంట్‌ను కూడా సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఒక చార్జిషీట్‌ను ఫైల్ చేసిన సిట్ అధికారులు తాజాగా మరో చార్జిషీట్‌ను ఫైల్ చేసి నిందితులకు తగిన శిక్ష పడేలా చేయనున్నారు.