మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (13:39 IST)

మూడో పెళ్లికి సిద్ధమైన నటుడు విజయ్ కుమార్ కుమార్తె!

తమిళ - తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటుడు విజయ్‌కుమార్. ఈయన కుమార్తె వనిత ఇపుడు మూడో పెళ్లికి సిద్ధమైంది. నిజానికి ఈమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరూ అమ్మ మూడో పెళ్లికి సమ్మతించారు. దీంతో వనిత మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి విజయ్ కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. ఈయన మొదటి భార్యకు అరుణ్ విజయ్ అనే కుమారుడు ఉన్నారు. ఈయన హీరో. రెండో భార్య మంజులకు ఐదుగురు కుమార్తెలు. వీరి పేర్లు శ్రీదేవి, వనిత, ప్రీత హరిత, అనిత, కవిత. వీరందరితో అరుణ్ విజయ్‌కు మంచి సంబంధం ఉంది. 
 
అయితే, ఐదుగురు కుమార్తెల్లో వనిత మాత్రం ఫైర్‌బ్రాండ్. 'దేవి' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన వనిత.. మూవీల్లో కంటే వివాదాస్పద అంశాలతోనే మంచి పబ్లిసిటీ కొట్టేసింది. అందుకే విజయ్ కుమార్ ఫ్యామిలీ ఈమెను దూరంగా పెట్టేసింది. అయితే, వనిత మాత్రం ఓ యూట్యూబ్ చానెల్‌ ప్రారంభించి, తద్వారా మంచి పేరు గడించింది.
 
ఈ క్రమంలో తనకు నచ్చిన పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన ముగ్గురు పిల్లల పర్మిషన్ కోరింది. అందుకు వారు సమ్మతించడంతో వనిత మూడో పెళ్లికి సిద్ధమైంది. ఈ వివాహం కూడా ఈ నెల 27వ తేదీన తన నివాసంలో సింపుల్‌గా జరుగనున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.