గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 23 సెప్టెంబరు 2021 (22:03 IST)

డబ్బుల కోసం ఆ పనులు చేశానంటున్న ప్రగతి

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా తనదైన రీతిలో నటిస్తూ ఉంది ప్రగతి. తెలుగు ప్రేక్షకులు చాలామంది ఆమెను అభిమానిస్తున్నారు. ఆమె నటన అంటే కూడా చాలామందికి ఇష్టమే. అయితే ఈమధ్య ఆమె బోల్డ్‌గా ఇచ్చిన ఇంటర్య్వూ కాస్త చర్చకు దారితీస్తోంది. 
 
కష్టమన్నది నాకు బాగా తెలుసు. కష్టంలోనే పుట్టాను పెరిగాను. ఊహ తెలిసినంత వరకు ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు కాస్త స్థిరపడ్డాను. డబ్బులు సంపాదించడానికి మగరాయుడిలా మారిపోయాను. నేను చేయని పనంటూ ఏమీ ఉండదు.
 
టెలిఫోన్ బూత్, పిజ్జా హౌజ్ లాంటి వాటిల్లో పనిచేశాను. అది ఎంత కష్టంగా ఉన్నా సరే పనిచేశాను. కానీ సినిమాల్లోకి రావడానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. టాలెంట్ ఉన్నా అవకాశాలు మాత్రం వచ్చేవి కాదు.
 
కానీ ఒకే ఒక్క సినిమాతో నేనేంటో నిరూపించుకున్నాను. ఇక ఆ తరువాత తిరిగి చూడనేలేదు. అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి. హీరో తల్లిగానో, లేకుంటే హీరోయిన్ తల్లిగానో, కుటుంబ పెద్దగానో ఇలా ఎన్నో క్యారెక్టర్లలో నటించాను.. నటిస్తూనే ఉంటానంటోంది ప్రగతి.