శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మే 2023 (18:22 IST)

ఆది పురుష్ ట్రైలర్ లాంచ్: 24-క్యారెట్ బంగారు ఖాదీ చీరలో కృతిసనన్

Kriti Sanon
Kriti Sanon
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆది పురుష్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లాంచ్‌లో ప్రభాస్, కృతిసనన్ కెమిస్ట్రీ అదిరింది. ఈ సందర్భంగా నటి కృతి సనన్ కట్టిన చీర గురించే ప్రస్తుతం చర్చ మొదలైంది. పాతకాలపు చీర కట్టులో రాయల్టీ లాగా కనిపించింది కృతి సనన్.
 
తెలుపు, బంగారు చీరతో కృతిసనన్ మెరిసిపోయింది. ఈ చీరకట్టులో సొగసైనదిగా, రాజసంగా కృతి కనిపించింది. చక్కటి జర్దోజీ అంచులతో కూడిన ఆఫ్-వైట్‌ అంచులతో కూడిన 24-క్యారెట్ బంగారు ఖాదీ బ్లాక్‌తో కూడిన కేరళ కాటన్ పాతకాలపు చీరను కలిపి డబుల్ డ్రేప్‌ను కలిగి ఉంది.
 
ప్రముఖ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ తన సాంప్రదాయ సమిష్టిలో కృతిని తీర్చిదిద్దారు. కృతి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. ఆదిపురుష్‌లో సీత పాత్రను పోషించింది.