Widgets Magazine

డ్రగ్స్ కేసు: సిట్ ముందుకు రవితేజ.. జిషాన్‌తో లింకుందా..? మాస్ మహారాజకు డ్రగ్స్ ఇచ్చాడట..!

శుక్రవారం, 28 జులై 2017 (09:12 IST)

Raviteja

హాట్ టాపిక్‌గా మారిన డ్రగ్స్ కేసు విచారణ పర్వంలో సిట్ ముందు మాస్ మహారాజ రవితేజ హాజరుకానున్నారు. శుక్రవారం రవితేజ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. కొన్ని రోజులుగా సినిమా షూటింగుల్లో భాగంగా విదేశాల్లో ఉన్న రవితేజ ఈ కేను నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్నారు. సిట్ విచారణ ఎదుర్కొనే ముందు రవితేజ ప్రముఖ లాయర్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. విచారణలో పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలని ముందుగానే ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. 
 
అయితే హీరో రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ ఇచ్చినట్టు సిట్ అధికారుల విచారణలో జిషాన్ వెల్లడించినట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో.. మాస్ మహారాజకు డ్రగ్స్ ఉచ్చు బిగుస్తుంది. సినీ సెలబ్రిటీలతో పోలిస్తే, టాప్‌లో ఉన్న రవితేజను శుక్రవారం సిట్ విచారిస్తుండటంతో, సిట్ కార్యాలయం ఎదుట భద్రతను మరింతగా పెంచారు. సిట్ నోటీసులు జారీ చేసిన వారిలో రవితేజ పేరు కూడా ఉండటంతో ఓ విధంగా తెలుగు సినీ పరిశ్రమ షాక్ అయ్యింది. 
 
రవితేజ సోదరుడు భరత్, ఇటీవల ఔటర్ రింగురోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఇతడు, గతంలో డ్రగ్స్ వ్యవహారాల్లో పోలీసులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే రవితేజ పేరు కూడా వచ్చింది. అప్పట్లో ఈ కేసు నీరుగారిపోయినా.. డ్రగ్స్ దందాపై అకున్ ఉక్కుపాదం మోపడంతో ప్రధాన సూత్రధారి కెల్విన్, జిషాన్ విచారణలో రవితేజ పేరు వచ్చిన సంగతి తెలిసిందే. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సిట్ కంటే కఠినుడు బిగ్ బాస్... ముమైత్ నోరు కట్టేశాడు.. మాటాలేదు. ఫోనూ లేదు

మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం, వినియోగం కేసులో బుక్కయిన ముమైత్ ఖాన్ వాస్తవానికి బిగ్‌బాస్‌ ...

news

ఈ పెద్ద చేపను తేలికగా వదులుతారా... నేడు సిట్‌ ముందుకు హీరో రవితేజ

ఇప్పటిదాకా మాదకద్రవ్యాల పంపిణీ, వినియోగం కేసులో సిట్ విచారణ ఎదుర్కున్న వారంతా ఒకెత్తయితే, ...

news

అప్పుడు ప్రేమమ్, ఇప్పుడు ఫిదా, రేపు 'కరు' మూడు చిత్రసీమల్లో సాయిపల్లవి జైత్రయాత్ర

మలయాల కుట్టి సమంత, పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత సినీ అవకాశాలను తన్నుకుపోతున్న ...

news

బొమ్మరిల్లు తర్వాత క్లాస్, మాస్ ఇద్దరినీ అలరిస్తున్న స్వచ్ఛమైన సినిమా ఫిదా.. ఆనందంలో యూనిట్

ఫిదా చిత్రం అందరి అంచనాలను తల్లకిందులో చేస్తు టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ పిక్చర్లలో ...