శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (11:51 IST)

అఖిల్ హలోలో మరో హీరోయిన్.. నివేదిత సతీష్ ఎవరు?

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా హలో. ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా హలో. ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్‌ని ఫిక్స్ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
కోలీవుడ్‌లో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ''మగలీర్‌ మట్టుమ్" అనే చిత్రంలో న‌టించిన నివేదిత స‌తీష్‌ని రెండో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. హ‌లో మూవీకి సంబంధించి ఇప్ప‌టికే రెండు పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన టీమ్ వ‌చ్చే నెల‌లో టీజ‌ర్ రిలీజ్ చేయాల‌ని భావిస్తుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బేనర్‌పై నాగ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్- వినోద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 
ఇప్పటికే నివేదిత షూటింగ్‌లో కూడా పాల్గొంటుందనే టాక్ వస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.