శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: సోమవారం, 25 మే 2015 (13:11 IST)

అక్కినేని అఖిల్ అప్పుడే బాలీవుడ్ భామలపై లుక్... శ్రద్ధా కపూర్‌తో చేస్తాడట...!!

హీరో తలచుకుంటే కానిది ఏముంది...? నాగార్జున వారసుడు అఖిల్‌కు బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలు చూడ్డం అంటే ఇష్టమట. తెలుగులో ఓ సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఎబిసిడీ2 అనే చిత్రం చూశాడట. అందులో వరుణ్‌ధావన్‌తో కలిసి శ్రద్ధాకపూర్‌ చేసిన సందడి బాగా నచ్చిందట. ఆమె చేసిన డాన్స్‌ చూసి తెగ మెచ్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు చెప్పడం జరిగింది. అయితే త్వరలో ఆమెతో కలిసి నటించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుముందు ఆమెతో కలిసి డాన్స్‌లు వేయడానికి మనోడు సిద్ధం.