శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (09:04 IST)

బాలీవుడ్ మన్మథుడికి భార్య వార్నింగ్.. నేనుంటే.. వారితో నీకేంపని...

బాలీవుడ్ మన్మథుడు అక్షయ్ కుమార్. ఆయన వలలో పడని హీరోయిన్ లేదు. అలనాటి రేఖ మొదలు, నేటి ప్రియాంక చోప్రా వరకు ఈయనగారు ప్రేమాయణం నడిపారు. ఇలా దాదాపు డజను మంది హీరోయిన్లను తన ఖాతాలో వేసుకుని బాలీవుడ్ మన్మథు

బాలీవుడ్ మన్మథుడు అక్షయ్ కుమార్. ఆయన వలలో పడని హీరోయిన్ లేదు. అలనాటి రేఖ మొదలు, నేటి ప్రియాంక చోప్రా వరకు ఈయనగారు ప్రేమాయణం నడిపారు. ఇలా దాదాపు డజను మంది హీరోయిన్లను తన ఖాతాలో వేసుకుని బాలీవుడ్ మన్మథుడిగా పేరుగడించాడు. 
 
అయితే, తన బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్పిన అక్షయ్... చివరకు హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ప్రియాంక చోప్రాతో రాసలీలలు సాగించి ట్వింకిల్‌కి అడ్డంగా దొరికిపోయాడు. అయితే అప్పటినుంచి కూల్‌గా ఉన్న అక్షయ్ ఇన్నాళ్లకు భార్యకు మళ్లీ పని చెప్పాడు. 
 
బాలీవుడ్ సెక్సీ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో రహస్య రాసలీలలు సాగిస్తున్నట్టు గుసగుసలు వినిపించాయి. దీంతో అక్షయ్‌ని ట్వింకిల్ ఖన్నా గట్టిగా హెచ్చరించినట్లు బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఆమెతో తిరగడం కాదు కదా.. కనీసం కనిపించినా తాట తీస్తానని బెదిరించినట్లు సమాచారం.