రాజశేఖర్ సరసన అమలా పాల్.. ఆడై తర్వాత టాలీవుడ్‌లోకి...

Last Updated: బుధవారం, 11 సెప్టెంబరు 2019 (12:43 IST)
ఆడై సినిమా ద్వారా అమలా పాల్ సెన్సేషనల్ క్రియేట్ చేసింది. బోల్డ్‌గా నటించి ఇతర హీరోయిన్లు చేయని సాహసం చేసింది. కోలీవుడ్, టాలీవుడ్‌లతో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తమిళంలోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అక్కడ కూడా గ్లామర్ తరహా పాత్రలు కాకుండా, నటనకి అవకాశం వున్న పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు సినిమాలో నటించే అవకాశాన్ని అమలా పాల్ కొట్టేసింది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ ఒక సినిమా చేయనున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. ఈ సినిమాలో కథానాయికగా అమలా పాల్‌ను ఎంపిక చేసినట్టుగా సమాచారం.దీనిపై మరింత చదవండి :