శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 27 జూన్ 2019 (22:45 IST)

నేను ఆ విషయంలో నిర్మాతలకు బాగా సహకరిస్తాను - అమలాపాల్

తమిళంలో వరుస అవకాశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది అమలాపాల్. విజయ్ సేతుపతితో నటించే కొత్త సినిమాలో అమలాపాల్‌ను ఎంపిక చేశారు. అయితే ఉన్నట్లుండి అమలాపాల్‌ను తీసేసి మేఘా ఆకాష్ ను తీసుకుంటున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో తమిళ సినీపరిశ్రమలో చర్చ ప్రారంభమైంది.
 
అమలాపాల్ నిర్మాతలను ఇబ్బందులు పెడుతుందని, ముందుగా సినిమా కోసం రేటు మాట్లాడుకుని ఆ తరువాత అప్పుడప్పుడు డబ్బులు అడుగుతూ అనుకున్న దానికన్నా ఎక్కువ తీసేసుకుంటుందని తమిళసినీపరిశ్రమలో ప్రచారం ఉంది. దీంతో అమలాపాల్ ను ఎంపిక చేసుకుని మళ్ళీ వద్దనుకున్నారట నిర్మాతలు. దీంతో అమలాపాల్‌కు చిర్రెత్తుకొచ్చింది.
 
నేను నిర్మాతలను ఎప్పుడూ అలా ఇబ్బంది పెట్టను. వారు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను. వారికి పూర్తిగా సహకరిస్తాను. నాపై దుష్ర్పచారం ఆపండి అంటూ అమలాపాల్ రెండు చేతులు ఎత్తి దణ్ణం పెడుతోంది.