ఒకే డ్రస్సును మళ్లీ మళ్లీ వేసుకుంటే బాగుంటుందా?: అమలా పాల్

శనివారం, 12 ఆగస్టు 2017 (13:48 IST)

amala paul - dhanush

ఒకే డ్రస్సును మళ్ళీ మళ్లీ వేయడం కుదరదు. క్యారెక్టర్‌కు తగినట్లు మార్చుకోవాల్సిందేనని సినీ నటి అమలా పాల్ అంటోంది. ధనుష్, అమలా పాల్, కాజల్ నటించిన వీఐపీ 2 శుక్రవారం రిలీజైన నేపథ్యంలో ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న అమలాపాల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ధనుష్ నటన బాగుందని.. దర్శకత్వం, నిర్మాణం వంటి అనేక విభాగాల్లో రాణించే సత్తా ఆయనకుందని వెల్లడించింది. 
 
కష్టపడి పైకొచ్చిన వ్యక్తుల్లో ధనుష్ ఒకడని తెలిపింది. తాను మాత్రమే నటనపరంగా మంచి మార్కులు కొట్టేయకుండా.. తనతో పాటు నటించే నటీనటుల నుంచి నటనను రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తాడని అమలా పాల్ ప్రశంసలు కురిపించింది. ఒక్కో సినిమాలో కొత్త కొత్త విషయాలు నేర్పిస్తాడని ధనుష్ గురించి అమలా పాల్ తెలిపింది. 
 
తిరుట్టుపయలె సినిమా ఫస్ట్ లుక్‌లో గ్లామర్‌గా కనిపించడంపై ఆమె మాట్లాడుతూ.. సినిమా సినిమాకు వెరైటీ వుండాలని.. ఒకే తరహా పాత్రల్లో కనిపించకూడదని వెల్లడించింది. అత్యుత్తమ నటిగా రాణించాలంటే విభిన్న పాత్రలు చేయాల్సిందేనని చెప్పుకొచ్చింది. ఒకే డ్రస్సును మళ్లీ మళ్లీ వేస్తే బాగుండదు కదా అంటూ అమలా పాల్ సమాధానమిచ్చింది.దీనిపై మరింత చదవండి :  
Glamour Vip 2 Dhanush Kajol Soundarya Amala Paul

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలకృష్ణ "పైసా వసూల్" మేకింగ్ వీడియో

నందమూరి బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ...

news

కమల్ హాసన్‌కు నచ్చని పని చేసిన గౌతమి.. ఏం చేసిందో తెలుసా?

సినీనటుడు కమల్ హాసన్ మాజీ ప్రేయసి గౌతమి.. ప్రస్తుతం ఆయనకు నచ్చని పని చేసింది. కమల్ ...

news

షెనాజ్ ట్రెజరీ వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు...

బాలీవుడ్ సెక్సీ సుందరాంగుల్లో షెనాజ్ ట్రెజరీ ఒకరు. ఈమె మలేషియాలో పర్యటిస్తూ అక్కడి ...

news

వీలుంటే ప్రతి యేడాది పెళ్లి చేసుకుంటానంటున్న బాలీవుడ్ హీరోయిన్!

మన దేశ సంప్రదాయం అనుమతిస్తే ప్రతి యేడాది పెళ్లి చేసుకుంటానని బాలీవుడ్ నట బిపాసా బసు ...