గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 జులై 2017 (14:53 IST)

అమితాబ్ రజనీకాంత్‌కి పొలిటికల్ కౌన్సిలింగ్ ఇచ్చేశారా? చిరంజీవిని గుర్తు తెచ్చుకోమన్నారా?

తమిళనాడులో జయలలిత మరణానికి తర్వాత అనేక పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశమే హాట్ టాపిక్‌‍గా మారింది. ప్రతిరోజూ రకరకాల వార్తలు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై వస్త

తమిళనాడులో జయలలిత మరణానికి తర్వాత అనేక పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశమే హాట్ టాపిక్‌‍గా మారింది. ప్రతిరోజూ రకరకాల వార్తలు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై వస్తూనే వున్నాయి. సోషల్ మీడియాలోనూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్ళిన రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం మంచిదా? కాదా? అనే దానిపై తన మిత్రుడు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ వద్ద చర్చించాలనుకుంటున్నారట. అమెరికా నుంచి వచ్చిన వెంటనే రజనీకాంత్ అమితాబ్‌ను కలుస్తారని తెలుస్తోంది. 
 
అయితే రజనీకాంత్ ముంబైలో కాల షూటింగ్ జరుగుతున్నప్పుడే అమితాబ్‌ను కలిశారని.. అప్పుడే రజనీకి బిగ్ బి కౌన్సిలింగ్ ఇచ్చేశారని సమాచారం. రాజకీయాల్లో వస్తే ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి అనే దానిపై ఇరువురి మధ్య పెద్ద చర్చే సాగిందని సినీ జనం అంటున్నారు. రాజకీయ రంగంలో ఉండే తీవ్రమైన ఒత్తిడి ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఇప్పటికే రజనీ కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ముంబైలో బిగ్ బిని ఇటీవల కలిసిన రజనీతో.. రాజకీయాల్లో తనకు ఎదురైన అనుభవాలను అమితాబ్ వివరించారు. అంతేకాదు, ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి... రాజకీయాల్లో  ఎలా విఫలమయ్యారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు.

దీంతో రాజకీయాల్లో రావడం అవసరమా? అనే ఆలోచనలో రజనీ మనసులో పడిందని సమాచారం. మరి రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారో? రారో తెలియాలంటే.. డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే డిసెంబర్ 12వ తేదీన రజనీ పుట్టినరోజు కావడంతో ఆరోజున రాజకీయ అరంగేట్రంపై ప్రకటన వుంటుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది.