గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (10:40 IST)

బ్రిటిష్ యాక్టర్‌తో ప్రేమలో పడిన అమీ జాక్సన్?

Amy jackson
బ్రిటిష్ నటి అమీ జాక్సన్ తాజాగా ఓ బ్రిటిష్ యాక్టర్‌తో డేటింగ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా ఆమె జార్జ్ పనాయోటౌ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. వారు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు.

వారి కొడుకు పుట్టిన తరువాత ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అప్పటి నుంచి అమీ ఒంటరిగానే ఉంటోంది.
 
అయితే తాజాగా అమీ జాక్సన్ మరోసారి ప్రేమలో పడింది. సమాచారం ప్రకారం అమీ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు వారిద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు. 
 
వెస్ట్‌విక్ వెబ్ సిరీస్ ‘గాసిప్ గర్ల్‌’లో నటించి పాపులర్ అయ్యాడు. వెస్ట్‌విక్, అమీ త్వరలో వారి సంబంధాన్ని అధికారికంగా తెలియజేయవచ్చని వినికిడి. అమీ సినిమాలు చేయడం మానేసినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే.