శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (22:07 IST)

అలా చేస్తే నా మొగుడు నన్ను వదిలేస్తానన్నాడు: యాంకర్ అనసూయ

బుల్లితెరపై అనసూయకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇది అందరికీ తెలిసిందే. సుమ తరువాత అనసూయకు బాగా క్రేజ్ ఉంది. ఆమె యాంకరింగ్ అంటే చాలా మంది ఇప్పటికీ పడిచచ్చిపోతుంటారు. అలాంటి అనసూయకు పెళ్ళి ఎప్పుడు జరిగిందో తెలుసా.. సరిగ్గా వాలైంటైన్స్ డే రోజే. అది కూడా 2010 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీనే. అంటే సరిగ్గా పదిసంవత్సరాలైందన్న మాట.
 
అయితే అనసూయ తన పెళ్ళిరోజును, వాలైంటైన్స్ డేను పురస్కరించుకుని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా భర్త భరద్వాజ్ నాకు సర్వస్వం. భరద్వాజ్‌తో పెళ్ళి కోసం పదేళ్ళు నేను నా తల్లిదండ్రులతో పోరాడాను. ఇది నిజం. ఎన్.సి.సి.లో పరిచయమైన భరద్వాజ్ నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. అతన్ని అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరన్నర పట్టింది. ఆ తరువాత పెళ్ళంటే చేసుకుంటే అతడినే అని నిర్ణయించుకున్నాను.
 
ఆ తరువాత మా పెళ్ళికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఎన్నో బాధలు పడి వారిని ఒప్పించాం. ఇద్దరు పిల్లలతో ఇప్పుడు హాయిగా కలిసి ఉన్నాను. అయితే పిల్లలను సరిగ్గా చూసుకోకపోతే నా భర్త నన్ను వదిలేస్తానంటూ ఆటపట్టించేవారు. పిల్లలంటే భరద్వాజ్‌కు చాలా ఇష్టం. యాంకరింగ్‌లో బిజీగా ఉంటున్నాను కదా అందుకే పిల్లల గురించి శ్రద్థ తీసుకోలేకపోతున్నానంటోంది అనసూయ. కానీ నా భర్త మాత్రం ఎన్ని పనుల్లో ఉన్నా పిల్లల విషయంలో మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటారని పొగడ్తలతో ముంచెత్తుతోంది.