బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 నవంబరు 2021 (09:52 IST)

యాంకర్ రవి దెబ్బకి బిగ్ బాస్‌కే దిమ్మతిరిగింది, అందుకే ఎలిమినేట్...

యాంకర్ రవి దెబ్బకి బిగ్ బాస్‌కే దిమ్మతిరిగింది. ఎలాగంటారా? బిగ్ బాస్ ప్రైజ్ మనీ కంటే యాంకర్ రవి పారితోషికం పైపైకి వెళ్లిపోవడమేనట. యాంకర్ రవికి వారానికి 8 నుంచి 9 లక్షల రూపాయల పారితోషికాన్ని బిగ్ బాస్ చెల్లిస్తున్నాడట. ఆ లెక్కన 12వ వారానికే రవి ఏకంగా కోటి రూపాయలకు అటుఇటుగా వచ్చేశాడట.

 
కనుక ఇక యాంకర్ రవిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైగా బిగ్ బాస్ టాప్ 3లో యాంకర్ రవి స్థానం ఖాయం అనుకున్నారు అంతా. ఐతే అతడికి హౌసులో మిగిలిన వారికంటే అత్యల్ప ఓట్లు వచ్చాయంటూ బిగ్ బాస్ చెప్పడాన్ని మాత్రం నెటిజన్లు ఒప్పుకోవడంలేదు. కానీ బిగ్ బాస్... ఎవ్వరి మాటా వినడు కదా.