గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (22:20 IST)

బుల్లితెరకు బైబై చెప్పేయనున్న యాంకర్ సుమ?

Anchor Suma
యాంకర్ సుమ బుల్లితెరకు బైబై చెప్పేయనున్నారు. 15 ఏళ్లకు పైగా యాంకర్‌గా రాణించిన సంగతి తెలిసిందే. తెలుగమ్మాయి  కాకపోయినా సుమ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఏ ఈవెంట్ అయినా సుమ వుండాల్సిందే. అలాంటి సుమ యాంకరింగ్‌కు దూరం కానుంది. 
 
ఇటీవల జరిగిన ఓ షోలో సుమ మాట్లాడుతూ.. తాను యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వ్వనున్నట్టు తెలిపి షాక్ ఇచ్చారు. యాంకరింగ్‌కు కొంతకాలం బ్రేక్ ఇవ్వనున్నట్లు  చెప్తూనే సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మేరకు ఒక ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.