శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2019 (13:11 IST)

ఆండ్రియా పెళ్లైన వ్యక్తితో ఆ పని చేసిందట.. కానీ ఆయన పేరు మాత్రం చెప్పలేదు..

అవును. ఆండ్రియా పెళ్లైన వ్యక్తితో డేటింగ్ చేసిందట. ఈ విషయాన్ని గాయని, నటి అయిన ఆండ్రియానే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో చెప్పింది. బ్రోకెన్ వింగ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పేజీని ఓపెన్ చేసిన ఆండ్రియా, తనను చీట్ చేసిన వ్యక్తి పేరు మాత్రం వెల్లడించలేదు. ఇంకా బ్రోకెన్ వింగ్ అనే పుస్తకంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. 
 
తాను ఇన్నాళ్లూ ఓ పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాననని చెప్పింది. అతను తనను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని చెప్పుకొచ్చింది. అతని వేధింపులతో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని ఆండ్రియా వెల్లడించింది. ఆ బాధ నుంచి కోలుకోవడం కోసం తాను ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే బ్రోకెన్ వింఅనే పుస్తకం రాసినట్లు చెప్పుకొచ్చింది.  
 
ప్రస్తుతం ఆండ్రియా చేతిలో తమిళ చిత్రాలు కా, వట్టం, మాలిగై వంటి సినిమాల్లో నటిస్తోంది. అప్పట్లో సుచీలీక్స్ సందర్భంగా ఆండ్రియా, యంగ్ దర్శకుడు అనిరుధ్‌తో కలిసి ఫోటోలు లీకైన సంగతి తెలిసిందే.