శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 18 నవంబరు 2014 (15:46 IST)

అంజలిని పిలవడం లేదట... అందుకే చెన్నై చెక్కేసిందట...

తెలుగువాడు అంటే విదేశాల్లో గౌరవం వుండవచ్చు. పక్క రాష్ట్రంలోనూ వుంటుంది. కానీ తెలుగులోనే వుండదు అని నటి అంజలి విషయంలో రుజువయింది. ఆమె సన్నిహితులే చెబుతున్నారు. సినిమాల్లో హీరోయిన్లుగా తెలుగువారు నటించడం చాలా అరుదు. అందుకే పరభాషల నుంచి హీరోయిన్లను తెప్పించి వారికి పెద్ద పీట వేస్తారు. ఇప్పుడు నెంబర్‌ 1, 2, 3లో వున్నవారంతా అక్కడివారే. అందుకే చాలామంది పరభాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 
 
నటి అంజలి కూడా అంతే.  ఆమెకు నటిగా పేరు, గుర్తింపు తెచ్చింది తమిళ పరిశ్రమ. అక్కడ విజయాలు సాధించిన చిత్రాలు తెలుగులో డబ్‌ అయ్యేసరికి ఆమె వెంట నిర్మాతలు పడ్డారు. హీరోలూ పడ్డారు. ఇక్కడకు వచ్చాక అసలు కథ మొదలైంది. ఇక్కడ విజయవంతమైన చిత్రాలు చేసింది. సీతమ్మ వాకిట్లో... బలుపు, గీతాంజలి వంటి సక్సెస్‌ చిత్రాలు చేసింది. అయినా అవకాశాలు రాలేదు. దాంతో విసుగెత్తి.. మళ్ళీ చెన్నై వెళ్లిపోయింది. 
 
తెలుగులో సినిమాలు చేస్తుండగానే.. ఆమె వ్యక్తిగత జీవితం వివాదంలోకి మారింది. దాంతో క్రేజ్‌ తగ్గింది. ఇదే ఇతర భాషల్లో చేస్తుంటే ఈపాటికి మరింత అగ్ర నటిగా పేరు తెచ్చుకునేదని ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఇకపై తెలుగులో చేయకపోయినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో....