శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:56 IST)

బోయపాటికి షాక్ ఇచ్చిన అంజలి, కాజల్‌కి కథ చెప్పడం వల్లనేనా?

నందమూరి నటసింహం బాలకృష్ణ - ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో సింహా, లెజెండ్ సినిమాలు రూపొందడం.. ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడంతో హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
 
ఈ మూవీని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో బాలయ్య సరసన ఎవరు నటిస్తారనేది ఆసక్తిగా మారింది. కథానాయిక అంజలి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు. ఇప్పుడు బోయపాటికి అంజలి షాక్ ఇచ్చిందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... బోయపాటి ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు అంజలికి కథ చెప్పారట. ఆ తర్వాత ఈ కథను కాజల్‌కి కూడా చెప్పారట. ఈ విషయం అంజలికి తెలిసి బాగా ఫీలయ్యందట. తనని అడిగి... మరోవైపు కాజల్‌ను కూడా కాంటాక్ట్ చేయడం అనేది అంజలికి నచ్చలేదట. దీంతో ఈ సినిమాలో నటించనని బోయపాటికి చెప్పేసిందట.
 
మరో వైపు కాజల్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పలేదట. దీంతో ఇటు అంజలి లేదు.. మరోవైపు కాజల్ కూడా ఓకే చెప్పలేదు. దీంతో బోయపాటి కథానాయిక వేటలో ఉన్నారట. మొత్తానికి బోయపాటికి అంజలి షాక్ ఇచ్చిందనేది హాట్ టాపిక్ అయ్యింది. అదీ సంగతి..!