గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:30 IST)

కన్నీళ్ళు పెట్టుకున్న అనుపమ పరమేశ్వరన్, ఎందుకు, ఏమైంది?

అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఇంటిలోనే ఉంటోంది. ఆమె ఒక్కరే కాదు హీరోయిన్లు అందరూ ఇంట్లోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి చెందుతూ ప్రజలు చనిపోతుండటం అందరినీ బాధిస్తోంది. అలాంటి ఘటనలు చూస్తే సున్నిత మనస్కులు మరింత చలించిపోతారు.
 
మన దేశంలో కాకున్నా ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉండడాన్ని వాట్సాప్‌ల ద్వారా చూసిందట అనుపమ పరమేశ్వరన్. దీంతో ఒక్కసారిగా కన్నీళ్లు ఆపుకోలేక బోరున విలపించేశారట.
 
తన ఆవేదనను చిన్నపాటి వీడియో చేసి తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపించిందట. ఇలాంటి మరణాలు ఎవరికీ రాకూడదు. మీరందరూ ఇళ్ళలోనే ఉండడండి. సేఫ్‌గా ఉండండి అంటూ అనుపమ ఆ వీడియో ద్వారా సందేశం పంపించిందట.