Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహానటిలో కీలకపాత్ర. ఇంకెవరిది.. అనుష్కదే..

హైదరాబాద్, గురువారం, 20 ఏప్రియల్ 2017 (04:29 IST)

Widgets Magazine

భారతీయ చలనచిత్రరంగంలోనే ముగ్ధమనోహర్ అపరూప కథానాయకి సావిత్రి అని దేశమంతా ఒప్పుకున్న వాస్తవం. దక్షిణాది చిత్రసీమ పుణ్యం చేసుకుంటే ఆవిర్భవించిన నవరస నటనా శిరోమణి సావిత్రి. ఆమెనటనలో ఎన్ని కోణాలు దాగి ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక్క మాయాబజార్ చూస్తే చాలు. అలనాటి నాయిక సావిత్రి జీవితకథ ఆధారంగా ‘మహానటి’ తీయనున్నట్టు ప్రకటించగానే..వెండితెరపై సావిత్రి వెలుగులే చూపిస్తారా లేదా ఆమె వ్యక్తిగత జీవిత ఘటనలూ ఉంటాయా అని ప్రేక్షకుల మదిలో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి.
Anushka
 
అయితే  ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ‘మహానటి’లో 1940 నుంచి 80 వరకూ సావిత్రి రియల్‌ అండ్‌ రీల్‌ లైఫ్‌ను చూపిస్తారని తెలుస్తోంది. తమిళ ‘మాయా బజార్‌’, ‘మిస్సమ్మ’ సినిమాల షూటింగ్‌ టైమ్‌లో జెమినీ గణేశన్‌ (తమిళ హీరో), సావిత్రి మధ్య ప్రేమ చిగురించిందనీ, తర్వాత వాళ్ల బంధం బలపడిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడీ సినిమాలో ఆ అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తారట! 
 
సావిత్రిగా కీర్తీ సురేశ్, విలేకరిగా సమంత నటించనున్నారని ఇప్పటికే చిత్ర నిర్మాతలు ప్రకటించేశారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రకు అనుష్కను సంప్రదించారట. ఏ పాత్రలో నటించమని ఆమెను అడిగారనేది ఇప్పటికైతే తెలీదు‌. సావిత్రి సమకాలికురాలిగా శక్తివంతమైన పాత్రలు నటించిన మరో నటి భానుమతి మాత్రమే. అయితే భానుమతి, సావిత్రికి పెద్దగా సన్నిహిత సంబంధాలు ఉండేవి కావు.
 
 ‘రుద్రమదేవి’, ‘సైజ్‌ జీరో’ వంటి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో అనుష్కే మెయిన్‌ హీరోయిన్‌ అని తెలిసిందే. ‘బాహుబలి–2’లోనూ ఆమెది శక్తివంతమైన పాత్రే. జీవితకాలానికి సరిపడిన అలాంటి పాత్రలు చేసిన ‘మహానటి’లో కీలక పాత్రను అంగీకరిస్తారో లేదో వేచి చూడాలి. ప్రకాశ్‌రాజ్‌ను సైతం కీలక పాత్ర కోసం చిత్రబృందం సంప్రదించారట. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమాస్‌ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మే రెండోవారంలో మొదలు కానుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గుండు కొట్టించుకున్నా... రూ.10 లక్షలు తీసుకుని రా... ముస్లిం పెద్దకు సోనూ నిగమ్ సవాల్...

ప్రముఖ గాయకుడు సోనీ నిగమ్ తనకు గుండు కొట్టించినవారికి రూ.10 లక్షలు ఇస్తానంటూ ఫత్వా జారీ ...

news

తెలుగు సినీ ఇండస్ట్రీ దుర్భరం... తమిళ సాంబార్ అమృతం... తెలుగు సాంబార్‌తో మోషన్స్...

ఆ నటుడికి ఇక్కడ ఏం చేదు అనుభవం వున్నదో కానీ తెలుగు సినీ ఇండస్ట్రీ మీద, తెలుగు వారి మీద ...

news

దర్శకుడు మణిరత్నం ఇంటిముందే ఆత్మహత్య చేసుకుంటానంటున్న లైట్‌మెన్

భారతీయ చిత్రపరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకదిగ్గజం ...

news

గూగుల్‌కే షాకిచ్చిన సెక్స్ బాంబ్ పూనమ్ పాండే... నా యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని వీక్షించండి!

బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు తేరుకోలేని షాకిచ్చారు. ...

Widgets Magazine