Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సాహో హీరోయిన్ అనుష్కే నట..రమేష్ బాలా ట్వీట్ నిజమే చెబుతోందా?

హైదరాబాద్, గురువారం, 6 జులై 2017 (06:05 IST)

Widgets Magazine

ఒక దేవసేన, ఒక అమరేంద్ర బాహుబలి.. ఈ జంట ఇప్పుడు భారతదేశంలో అత్యంత విజయవంతమైన జంట. ఒక జీవితకాలానికి సరిపడ చిరకీర్తిని ఈ రెండు పాత్రలూ ఆర్జించుకున్నాయి. ఇప్పటికీ బాహుబలి హ్యాంగోవర్ నుంచి బయటపడని ఈ జంట మళ్లీ మరో సినిమాలో జత కట్టడానికి సిద్ధమైపోయారని వార్తలు. తమిళ చిత్ర విశ్లేషకుడైన రమేష్ బాలా ట్వీట్ సాక్షిగా వీరిరువురు సాహోలో జంటగా నటిస్తున్నారని తెలుస్తోంది.
anushka-prabhas
 
ప్రభాస్-జంట తెలుగు వెండితెర మీద ఎవర్‌గ్రీన్ జంటగా పేరు తెచ్చుకుంది. బాహుబలితో భారీ విజయాలను అందుకున్న ఈ జంట తాజాగా మరో సినిమాలో అలరించబోతోంది. యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.
 
దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అనుష్క.. ఇలా పలువురి పేర్లు వినిపించినా చిత్ర యూనిట్ అయితే ఇప్పటి వరకు ఎవరినీ నిర్ధారించలేదు. తాజాగా తమిళ సినీ విశ్లేషకుడైన రమేష్ బాలా సాహో చిత్రంలో హీరోయిన్‌గా అనుష్కను తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో  సాహో తెరకెక్కుతోంది. అయితే ఈ విషయంపై మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సాయిధరమ్ మామూలోడు కాదు.. ఆమెను ఎలా వాడేస్తున్నాడో చూడండి (Video)

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ...

news

బ్రేకప్ సాంగ్‌కు ఎలా డ్యాన్స్ చేసిందో చూడండి (Video)

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతీయువకులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ప్రతి ...

news

ఆ కారణంగా ఓ తెలుగు హీరోతో ఆరేళ్ళు డేటింగ్ చేశా : ఇలియానా

తెలుగు చిత్రపరిశ్రమకు దిగుమతి అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన భామల్లో ఇలియానా ఒకరు. ఈ గోవా ...

news

కృష్ణవంశీ "నక్షత్రం" సినిమా ట్రైలర్ (Video)

సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర నక్షత్రం. ఈ చిత్రంలో సందీప్ ...

Widgets Magazine