Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

‘ఖైదీ నెంబర్‌ 150’ సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన 'కత్తి' మురుగదాస్

గురువారం, 12 జనవరి 2017 (11:43 IST)

Widgets Magazine
ar murugadoss

తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న డైరక్టర్. ఈ దర్శకుడు తెరకెక్కించే చిత్రాలు సూపర్ డూపర్ హిట్లు కావాల్సిందే. అలాంటిదే తమిళంలో వచ్చిన "కత్తి" చిత్రం. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్నే మెగాస్టార్ చిరంజీవి తెలుగులో "ఖైదీ నంబర్ 150" పేరుతో రీమేక్ చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తూ.. కనకవర్షం కురిపిస్తోంది. పైగా.. సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో ఖైదీ (కత్తి) చిత్రానికి వివి.వినాయక్ దర్శకత్వం వహించాడు. 
 
అయితే, ఈ సినిమా చూసిన మురుగ‌దాస్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ట‌. అందుకు మంచి కారణం ఉందట. ఈ చిత్ర ప్రదర్శనను వీక్షించిన మురుగదాస్ స్పందిస్తూ సినిమా అంతా బాగానే ఉందని అన్నాడు. అందులో క‌నిపించిన‌ కొన్ని సీన్లపై మాత్రం అభ్యంత‌రంగా ఉన్నాయన్నారు. సాధారణంగా తాను తీసే సినిమాలో కొన్ని విలువ‌లు ఉండాల‌ని కోరుకుంటానని, అందుకే తన చిత్రాల్లో ఆల్కహాల్‌ సీన్లు దాదాపుగా ఉండకుండా చూస్తానని వ్యాఖ్యానించాడట. 
 
అందుకే తమిళ 'కత్తి' చిత్రంలో కనీసం విలన్ కూడా ఆల్క‌హాల్ తీసుకోడు. కేవ‌లం టీ, కాఫీలను మాత్ర‌మే హీరోలు, విలన్లు సేవిస్తుంటారు. కానీ, తెలుగు 'ఖైదీ'లో మాత్రం ఏకంగా హీరోయే లిక్కర్‌ సీన్లు చేయడం ఆయ‌న‌కు నచ్చలేదట. దీంతో పాటు క‌మెడియ‌న్‌ అలీతో సినిమాలో ఆడవేషం వేయించిన తీసిన‌ కామెడీ కూడా ఆయనకు అసంతృప్తి కలిగించినట్టు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మా మావయ్య ఇరగదీశాడు... 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై నారా లోకేష్ ట్వీట్

సినీ నటుడు బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం గురువారం ప్రపంచ ...

news

మెగా బ్రదర్ నాగబాబుకు థ్యాంక్స్ చెపుతున్న బాలకృష్ణ అభిమానులు.. ఎందుకంటే?

మెగా బ్రదర్ నాగబాబుకు నందమూరి బాలకృష్ణ అభిమానులు ధన్యవాదాలు చెపుతున్నారు. గుంటూరు వేదికగా ...

news

'బాలయ్యా... మీరే ఆదర్శ'మన్న సాయి ధరమ్ తేజ్... హ్యాట్సాఫ్ అన్న మంచు మనోజ్

నందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ...

news

"ఘాజీ" ట్రైలర్ వచ్చేసింది.. 1971 ఇండో-పాక్ సబ్‌మెరైన్ వార్ నేపథ్యంలో... (ట్రైలర్)

దగ్గుబాటి హీరో రానా హీరోగా నటించిన కొత్త చిత్రం "ఘాజి". 1971లో భారత్, పాకిస్థాన్ దేశాల ...

Widgets Magazine