శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (14:07 IST)

'గౌతమిపుత్ర శాతకర్ణి' దర్శకుడు క్రిష్‌కు 'బాహుబలి' ఫీవర్.. ఖైదీతో లెక్కలేదట..

'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర దర్శకుడు క్రిష్‌కు 'బాహుబలి' ఫీవర్ పట్టుకుందట. అదేసమయంలో మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150"ని లెక్కలోకి తీసుకోవడం లేదట. దీనికి కారణం లేకపోలేదు. ఖైదీ చిత్రానిక

'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర దర్శకుడు క్రిష్‌కు 'బాహుబలి' ఫీవర్ పట్టుకుందట. అదేసమయంలో మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150"ని లెక్కలోకి తీసుకోవడం లేదట. దీనికి కారణం లేకపోలేదు. ఖైదీ చిత్రానికి పూర్తి మాస్ మసాలా దట్టించి విడుదల చేశారు. కానీ, "బాహుబలి" విషయానికి వస్తే మరోలా ఉంది. అందుకే క్రిష్‌కు ఆ భయం పట్టుకుందట. 
 
తెలుగుజాతి చరిత్రను, ఉన్నతిని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో గొప్ప చారిత్రక దృశ్యకావ్యంగా దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ విధంగానే ఈ చిత్రం ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. అయితే 'గౌతమిపుత్ర శాతకర్ణి' జీవితం ఆధారంగా చేసుకొని చేసిన ఈ చిత్రంపై చిత్ర యూనిట్‌కు పూర్తి నమ్మకం ఉంది. కానీ ఓ టెన్షన్ మాత్రం వేధిస్తోందట. 
 
శాతకర్ణి చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదలైనప్పటి నుంచి విజువల్ వండర్ అన్నట్లు ‘బాహుబలి’తో పోలుస్తూ జనాల్లో ఊహలు మొదలయ్యాయి. అయితే ఇదీ హిస్టారికల్ చిత్రం కావడం, ఇందులో భారీస్థాయి యుద్ధాలు, ఏకంగా గంటపాటు యుద్ధ సన్నివేశాలే ఉండటంతో ప్రేక్షకులు అంతా 'బాహుబలి'ని మించిన ఫాంటసీలా ఊహాలోకంలో విహరిస్తుండటం తెలిసిందే.
 
అయితే తాజాగా దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ అసలు 'బాహుబలి'కి 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రానికి పోలికే లేదని వెల్లడించాడు. క్రిష్ ఇంకా మాట్లాడుతూ 'బాహుబలి' ఓ ఫాంటసీతో కూడుకున్న చిత్రమని, 'శాతకర్ణి' మాత్రం ఓ చక్రవర్తి చరిత్ర అని, రెండిటినీ ఒకేలా పోల్చడం పొరపాటని ఆయన వెల్లడించాడు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' విజువల్ ఎఫెక్ట్స్‌కు చెందిన చిత్రమే కాదని, ఈ సినిమా పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా చేశామని ఆయన వెల్లడించాడు.