Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రభాస్‌ డైరెక్ట్ హిందీ సినిమా.. నిర్మాత కరణ్ జోహర్.. మరి దర్శకుడూ.. ఇంకెవ్వరు రాజమౌళే..

హైదరాబాద్, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (04:18 IST)

Widgets Magazine

ఏ తెలుగు హీరోకూ దొరకని అపూర్వ గుర్తింపు బాహుబలి హీరో ప్రభాస్ సొంతమైంది. తెలుగు సినిమాకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ బాహుబలి చిత్రంతో అంగుష్టమాత్రుడు మహాకాయుడైన చందాన జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందాడు. ఇప్పుడా గుర్తింపు బాలీవుడ్‌లోనే ప్రముఖ సినిమా నిర్మాత నేరుగా అతడితోనే సినిమా నిర్మించే స్థాయికి తనను తీసుకెళ్లింది.
rana - prabhas
 
బాహుబలి ది బిగినింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి బాలీవుడ్ ఆడియెన్స్‌కి సుపరిచితుడైన ప్రభాస్ త్వరలోనే బాలీవుడ్‌లో ఓ డైరెక్ట్ మూవీ చేయనున్నాడని తెలుస్తోంది. బాహుబలి సినిమాను హిందీ ఆడియెన్స్‌కి అందించిన కరణ్ జోహర్ అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. బాహుబలి సినిమా బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అవడంతో ఆ సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, యాక్టర్ ప్రభాస్‌లపై కరణ్‌కి మంచి నమ్మకం, స్నేహం ఏర్పడ్డాయి. దీంతో ఈసారి హిందీలో మళ్లీ రాజమౌళి-ప్రభాస్‌ల కాంబినేషన్‌లో సినిమాని నిర్మించడానికి కరణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
 
'బాహుబలి 2' తర్వాత 'రన్ రాజా రన్ ఫేమ్' సుజీత్ రెడ్డి డైరెక్షన్‌లో 'సాహో' సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా పూర్తయిన తర్వాత కరణ్‌తో సినిమా వుండవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 28న బాహుబలి-2 రిలీజ్ కానుండటంతో ప్రస్తుతం ప్రభాస్ ఎక్కువ సమయం ఈ సినిమా ప్రమోషన్స్‌కే కేటాయిస్తున్నాడు. బాహుబలి-2 ప్రమోషన్స్ పూర్తయితే, ఆ తర్వాత పూర్తిగా సుజీత్ సినిమాకే టైమ్ కేటాయించనున్నాడు ప్రభాస్.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఫుల్లుగా మద్యం లాగించాడు.. హీరోయిన్‌తో ఏదోదో వాగాడు... ఉద్యోగం ఔట్... అవసరమా?

బాడీ గార్డ్ అంటే అంగరక్షకులు. 24 గంటలూ తమ యజమానుల రక్షణలో ఉండే బాడీగార్డులకు కాస్త ...

news

కట్టప్ప చేసిన కామెంటుకు బాహుబలిపై కోపించకండి.. మాకు మీ ప్రేమ కావాలి: వేడుకున్న రాజమౌళి

తాము ఎంతో వ్యయప్రయాసలతో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక ‘బాహుబలి 2’ సినిమా దయచేసి ...

news

అందుకే నందమూరి మోక్షజ్ఞకు నటించాలన్న ఆసక్తి లేదట...

నందమూరి బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ త్వరలో తెరంగేట్రం చేస్తాడన్న అభిమానులకు షాకింగ్ ...

news

హీరోల ముందే (ఆరుబయట) దుస్తులు మార్చుకొనేవాళ్లం... సీనియర్ నటి...

సీనియర్ నటి ఒకరు సంచలన నిజాలు వెల్లడించింది. తాము సినీ ఫీల్డులో ఉన్న పరిస్థితులు, ...

Widgets Magazine