Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'పెళ్లికాని ప్రసాద్'గా బాలకృష్ణ .. డైరెక్టర్ తేజతో మంతనాలు?

శనివారం, 16 సెప్టెంబరు 2017 (13:49 IST)

Widgets Magazine

విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపించే హీరో నందమూరి బాలకృష్ణ ఈ దఫా పెళ్లికాని ప్రసాద్ తరహాలో ఓ పాత్ర చేయనున్నారు. ఇటీవల బాలయ్య నటించిన 101వ చిత్రం "పైసా వసూల్" బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శత్వం వహించారు. 
 
అయితే, తన 102వ చిత్రాన్ని మాత్రం బాలయ్య ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న గట్టి సంకల్పంతో ఉన్నారు. ఇందులోభాగంగా, 102వ సినిమాకి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ ఎలా కనిపించబోతున్నాడు? ఆయన పాత్ర ఎలా వుండబోతోంది? అనే విషయాలపై అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు.
 
ఈ సినిమాలో ఆయన 'పెళ్లికాని ప్రసాద్' తరహా పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. 40 ఏళ్లు వచ్చేవరకూ పెళ్లి కాకుండా ఉండిపోతాడట. ఆ తర్వాత నయనతారను ప్రేమించి భగ్న ప్రేమికుడిగా మారిపోతాడనేది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అందుకు గల కారణాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయట. చిత్రం రెండో భాగంలో మళ్లీ నయనతార ఆయన జీవితంలోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. కాగా, ఈ చిత్రంలో మరో కథానాయికగా నటాషా దోషి నటిస్తుండగా, ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల మందుకురానుంది.  
 
మరోవైపు.. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు తేజకు హీరో బాలకృష్ణ నుంచి పిలుపు వెళ్లిందట. ఎంతో మంది పెద్ద నిర్మాతలు తేజతో చిత్రం చేసేందుకు క్యూలో ఉండగా, ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తాను తలపెట్టిన చిత్రానికి తేజతో దర్శకత్వం చేయించాలని బాలయ్య భావిస్తున్నట్టు సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 
 
ఈ విషయంలో బాలకృష్ణ, తేజల మధ్య చర్చలు కూడా జరిగాయని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, దాదాపుగా ఎన్టీఆర్ బయోపిక్‌కు తేజ దర్శకుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"మహానటి"లో మోహన్ బాబు.. ఎస్వీఆర్ పాత్రలో...

అలనాటి నటీమణి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా 'మహానటి' చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ...

news

ఆ హీరోయిన్ అందానికి 'ఫిదా' అయిన మాటల మాంత్రికుడు?

తెలుగు వెండితెరకు పరిచయమైన కొత్త హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఈమె అందానికి ...

news

రజినీతో జట్టు కట్టేందుకు సిద్ధం : కమల్ హాసన్ ప్రకటన

ఇద్దరు రాజకీయ ఉద్ధండులు కరుణానిధి, జయలలితలు పూర్తిగా కనుమరుగైన నేపథ్యంలో తమిళనాడు ...

news

'బిగ్ బాస్' హౌస్‌కు జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్లు.. ఇక సందడే సందడి...

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్ బాస్. ...

Widgets Magazine