Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మ‌ళ్లీ ఆ హీరోయిన్‌కే బాల‌య్య ఛాన్స్

మంగళవారం, 15 మే 2018 (21:10 IST)

Widgets Magazine

నంద‌మూరి న‌టసింహం బాలకృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఓ వైపు ఎన్టీఆర్ బ‌యోపిక్ చేసేందుకు రెడీ అవుతూనే మ‌రోవైపు డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం విశేషం. సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాని ఈ నెల 27న ప్రారంభించ‌నున్నారు. మాస్ ఆడియన్స్‌కి నచ్చే అంశాలతో కథను రెడీ చేయడంలో వినాయక్ సిద్ధహస్తుడు. 
shriya
 
ఇక వినాయ‌క్‌కి బాల‌య్య జ‌త క‌లిస్తే... ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రంలో న‌టించేందుకు మ‌ళ్లీ శ్రియ‌కే ఛాన్స్ ఇచ్చాడ‌ట బాల‌య్య‌. గతంలో బాలకృష్ణ సరసన శ్రియ 'చెన్నకేశవరెడ్డి' .. 'గౌతమీపుత్ర శాతకర్ణి' .. ' పైసా వసూల్' చిత్రాల్లో నటించింది. నాలుగోసారి ఆమె ఈ సినిమాలో బాలకృష్ణతో జోడీ కడుతోంది. 
 
వివాహమైన తరువాత శ్రియ చేస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఖైదీ నెం 150 త‌ర్వాత వినాయ‌క్ తెర‌కెక్కించిన ఇంటిలిజెంట్ ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే స‌క్స‌స్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో వినాయ‌క్ ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. మ‌రి.. బాల‌య్యను కొత్త‌గా వినాయ‌క్ ఎలా చూపించ‌నున్నారో?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మ‌హేష్ బాబుతో పోటీ గురించి క్లారిటీ ఇచ్చిన చ‌ర‌ణ్‌..!

మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను, రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం చిత్రాలు క‌లెక్ష‌న్స్ విష‌య‌మై ...

news

స‌వ్య‌సాచి రిలీజ్ వాయిదా ప‌డిందా..?

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న తాజా చిత్రం స‌వ్య‌సాచి. ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి ...

news

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా ప్లాన్ చేస్తోన్న అశ్వ‌నీద‌త్..!

వైజ‌యంతీ మూవీస్ ఎలాంటి భారీ చిత్రాల‌ను అందించిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అగ్ర ...

news

చెన్నై 'బట్ట బాబ్జీ'గాడు బాగా వాడేసుకున్నాడు... శ్రీరెడ్డి

నటి శ్రీరెడ్డి చెపుతున్న షాకింగ్ విషయాలతో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి విపరీతంగా ...

Widgets Magazine