శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (22:40 IST)

బోయపాటిలో పందెం కోడి హీరోయిన్?

మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాదిన ఆమెకుండిన క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో 'అమ్మాయి బాగుంది' సినిమాతో పరిచయమైన మీరా జాస్మిన్, 'గుడుంబా శంకర్' సినిమాతో పాప్యులర్ అయింది. వివాహమైన తరువాత సినిమాలకి దూరమైనా ఆమె, ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది.
 
రామ్ హీరోగా బోయపాటి ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మీరా జాస్మిన్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఆమె బోయపాటి దర్శకత్వంలో 'భద్ర' చేసిన సంగతి తెలిసిందే.