Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీమంతుడుకి సీక్వెల్ రాబోతుందా? భరత్ అను నేను టైటిల్ ఫిక్స్ చేస్తారా?

ఆదివారం, 19 మార్చి 2017 (12:49 IST)

Widgets Magazine

ఊరికోసం ఏదైనా చేయాలనే కాన్సెప్టుతో వచ్చిన మహేష్ బాబు 'శ్రీమంతుడు' సినిమా తర్వాత గ్రామాలను దత్తత తీసుకోవడం, ఊరి బాగు కోసం మంచి చేయడం లాంటివి చాలామంది ఆచరిస్తున్నారు. మహేష్ బాబు కూడా స్వయంగా దీన్ని ఆచరిస్తూ... అభిమానులు తన దారిలో నడిచేలా చేస్తున్నాడు. శ్రీమంతుడు సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
 
ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంతో పాటు తెలంగాణలో సిద్దాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పనులను మహేష్ బాబు సతీమణి నమ్రత చూసుకుంటన్నారు. ఈ నేపథ్యంలో శ్రీమంతుడు కాన్సెప్ట్ చాలామందికి నచ్చేసింది. ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేయడంతో పాటు హిట్ కొట్టేసింది. 
 
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే శ్రీమంతుడు హీరోయిన్ శృతిహాసన్‌ని ఫైనల్ చేసే ఆలోచనలో వున్నాడట కొరటాల. మహేష్-శృతి పెయిర్ వర్కవుట్ కావడంతో ఈ కాంబోని రిపీట్ చేయాలని ఆలోచిస్తున్నాడట డైరక్టర్. 
 
మ్యూజిక్ డైరెక్టర్ దేవితో అప్పుడే మ్యూజిక్ సిట్టింగ్ మొదలుపెట్టాడు కొరటాల. దీనికి 'భరత్ అను నేను' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా దేవి క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం మురుగదాస్‌తో మహేష్ ప్రాజెక్ట్ ఫినిష్ కాగానే కొరటాల మూవీ సెట్స్ మీదకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవే హీరో నేను కాదు : 'కాటమరాయుడు'లో పవన్‌

''ఫంక్షన్‌లకు వెళ్ళాలంటే భయమేసేది. ఎందుకంటే చిరంజీవిగారే హీరో.. నేను కాదు... నేను చేసిన ...

news

వపన్‌ భగత్‌సింగ్‌... బండ్ల గణేష్‌: నిజాయితీపరుడు... టీవీ 9 రవిప్రకాష్‌, ముఖ్యమంత్రి కావాలా?

'కాటమరాయుడు' ఆడియో ప్రి-రిలీజ్‌ ఫంక్షన్‌ శనివారం శిల్పకళావేదికలో జరిగింది. ఆదిత్య ...

news

ఆ చిత్రంలోని ఆ ఒక్క పాటకే 15 కోట్ల వ్యూస్... మరి బాహుబలి సంగతేంటి? (Video)

ఇపుడు కొత్త చిత్రాల ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ద్వారానే జరుగుతోంది. ...

news

'ఉయ్యలవాడ నర్సింహా రెడ్డి' ఫస్ట్‌లుక్‌ ఇదే.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రంగా ఉయ్యలవాడ నరసింహా రెడ్డిలో నటించనున్నారు. దాదాపు ...

Widgets Magazine