Widgets Magazine

'బిగ్‌బాస్' ఓవియా సూసైడ్ అటెంప్ట్... ఐసీయూలో చికిత్స.. ప్రాణాలకు ముప్పా?

ఆదివారం, 6 ఆగస్టు 2017 (11:23 IST)

oviya

తమిళంలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న నటి ఓవియా సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారన్నది కోలీవుడ్‌లో ప్రధాన చర్చ. హీరో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రసారం అవుతోంది.
 
ఇందులో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌లలో ఒకరు నటి ఓవియా. ప్రస్తుతం ఈ పేరు తమిళనాట వ్యాప్తంగా మార్మోగిపోతోంది. దాదాపు 10 సినిమాల్లో నటించినా దక్కని పాపులారిటీ, క్రేజ్‌ ఒక్క ‘బిగ్‌బాస్‌’ షోతో ఆమె సొంతం చేసుకుంది. ‘కలవాణి’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ మలయాళతార ‘బిగ్‌బాస్‌’ పుణ్యమా అని సోషల్‌ మీడియా‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది.
 
గత కొన్ని రోజులుగా నెటిజన్లు ఓవియా గురించే ఎక్కువగా చర్చించుకుంటూ సెర్చ్ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఓవియా పేరుతో ఉన్న హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌గా మారాయి. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓవియాపై ఈగ వాలనీయడం లేదు. అంతగా యువతను ఆకర్షిస్తున్న ఓవియాకు సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.
 
ఇలాంటి పరిస్థితుల్లో ఓవియా సూసైడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారాయి. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు తీవ్ర చికిత్సలు అందిస్తున్నారు. అయితే ఓవియా ఆత్మహత్యకు యత్నించిందన్న వార్తలను ఆమె సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఆమెకు ఆరోగ్యం సరిగా లేనందువల్ల ఆస్పత్రిలో చేరిందని చెబుతున్నారు. మొత్తాన్ని ఓవియాకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా ఇప్పుడు హాట్‌న్యూస్‌గా మారిపోతోంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తమిళ బిగ్ బాస్... నటి ఒవియా సూసైడ్ ఎటెంప్ట్... కమల్ పొలిటికల్ దుమారం(వీడియో)

తమిళ బిగ్ బాస్ ఆది నుంచి గందరగోళంగా సాగుతోంది. షో ప్రారంభ సమయంలో ఈ షోలో పాల్గొనేవారి ...

news

మరో మహిళతో అక్రమ సంబంధం... నన్ను బూతులు తిట్టేవాడు... తెలుగు గాయని ఆవేదన...

రా.. రమ్మని... రారా రమ్మని... అనే పాటతో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో ఓ స్వీట్ ...

news

దొంగల్లా అర్థరాత్రి తొలగిస్తారా? ఆయనకు మీరిచ్చే గౌరవం ఇదేనా?: కమల్ ఫైర్

తమిళుల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్న మహా నటుడు శివాజీ గణేశన్ విగ్రహాన్ని గుట్టుచప్పుడు ...

news

ఏంటి.. అనుష్కతో లింకెట్టేస్తారా? దేవసేనతో పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్

ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాహుబలి-2. ఈ చిత్రం వంద ...