గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (18:51 IST)

లేజర్ ద్వారా ధనుష్ పుట్టుమచ్చల్ని చెరిపేశాడా? డీఎన్ఏ టెస్టుకు రెడీ కావాల్సిందేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు తల్లిదండ్రులు మేమేనని చెప్పుకుంటూ మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తాను కస్తూరి రాజా

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు తల్లిదండ్రులు మేమేనని చెప్పుకుంటూ మేలూరుకు చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తాను కస్తూరి రాజా పుత్రుడినా.. కదిరేశన్ కుమారుడినా అని నిరూపించుకునేందుకు కొంత సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ కేసును కొట్టిపారేయాలని ధనుష్ తరపున పిటిషన్ కూడా దాఖలైంది. 
 
అయితే ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ధనుష్ తాను కస్తూరి రాజా కుమారుడైతే.. ఎందుకు సమయం కావాలని కోరాడని ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. అంతేగాకుండా.. ఈ కేసుకు సంబంధించిన కీలక మెడికల్ రిపోర్టులో ధనుష్ తన శరీరంపై గల మచ్చలను లేజర్ ద్వారా తొలగించినట్లు సమాచారం. ధనుష్ తన శరీరంపై గల మచ్చల్ని ఇలా లేజర్ ద్వారా తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న తలెత్తింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ ఈ కేసు విచారణకు రానుంది. ఈ సందర్భంగా కదిరేశన్-మీనాక్షి దంపతులు ధనుష్‌కు డీఎన్ఏ పరిశోధన చేయాలని కోర్టును కోరనున్నట్లు తెలిసింది. ఈ టెస్టులో ధనుష్ తమ కుమారుడేనని తేలిపోతుందని కదిరేశన్ దంపతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.