శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 మార్చి 2020 (14:46 IST)

రాజమౌళికి షాక్.. ఆర్ఆర్ఆర్ నుంచి అలియా భట్ ఔట్?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ యేడాది జూలై నెలాఖరులో రిలీజ్ కావాల్సివుండగా, హీరోయిన్ల సమస్యతో పాటు.. ఇతర కారణాల రీత్యా ఈ చిత్రం విడుదల వచ్చే యేడాదికి పోస్ట్ పోన్ అయింది. 
 
ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన పూణె షెడ్యూల్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ నటి అలియా భట్‌ను ఎంపిక చేశారు. పూణె షెడ్యూల్‌కు ఆమె రావాల్సి ఉంది. అయితే, ఈ షెడ్యూల్ వాయిదా పడటంతో... ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 
 
బాలీవుడ్‌లోని బిజీ తారల్లో అలియా భట్ కూడా ఒకరు. దీంతో, ప్రతి సినిమాకు పక్కా ప్లానింగ్‌తో ఆమె డేట్స్ ఇస్తుంటుంది. ఇప్పుడు రాజమౌళి చిత్రం వాయిదా పడటంతో... తర్వాతి రోజుల్లో ఈ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయడం అలియాకు కష్టంగా మారిందట. 
 
ఒకవేళ ఈ చిత్రం నుంచి అలియా తప్పుకుంటే... ఆమె స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల బ్రిటన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడంతో... ఆమె స్థానంలో ఒలీవియా మారిస్‌ను ఎంపిక చేశారు.