సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (18:41 IST)

ఇలియానా పరిస్థితి ఇలా తయారయ్యిందా..?

టాలీవుడ్, కోలీవుడ్ అంటూ బిజీబిజీగా గడుపుతూ వచ్చిన ఇలియానాకు బాలీవుడ్ అంతగా కలిసిరాలేదు. బాలీవుడ్‌లో ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఇలియానా.. ఆపై ప్రేమలో పడింది. ఇంకా సినిమాలు మానేసి హాయిగా బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది గోవాబ్యూటీ. ఇటీవల తెలుగులో అక్బర్ సినిమాలో రవితేజతో బొద్దుగా కనిపించింది. 
 
ఆరేళ్ల గ్యాప్ తర్వాత రవితేజ నటించడం ద్వారా తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా..చెర్రి వినయ విధేయ రామలో ఐటమ్ సాంగ్‌ అవకాశాన్ని కూడా వదులుకుంది. కానీ వినయ విధేయ రామ హిట్ కాకపోవడంతో షాకైన ఇలియానా.. ఐటమ్ సాంగ్‌ను పక్కనబెట్టేయడం మంచికేనని ఊపిరి పీల్చుకుంది. అయితే ఇల్లీ బ్యూటీ చేతిలో అవకాశాలు లేవు. 
 
దీంతో సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను పోస్టు చేస్తోంది. అయితే ఈ ఫోటోల్లో గ్లామర్ డోస్ బాగా తగ్గిందని సినీ జనం అంటున్నారు. అమ్మడు ఇలియానా నడుము అందాలు బాగా తగ్గిపోయాయని.. ముఖం తేలిపోయిందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి సోషల్ మీడియాలో అమ్మడు పోస్టు చేసే ఫోటోలను చూసి దర్శక నిర్మాతలు ఛాన్సులు ఇస్తారో లేదో వేచి చూడాలి.