నయనతార నిర్మాణ సంస్థపై కేసు!
నయనతార, తనకు కాబోయే భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ అనే బేనర్ స్థాపించారు. దీనిపై సినిమాలు తీస్తున్నారు. కాగా, వీరి నిర్మాణ సంస్థ పేరులో రౌడీ అనేది వుందని అభ్యంతరం చెబుతూ ఓ వ్యక్తి కేసే వేశాడు. వివరాల ప్రకారం కన్నన్ అనే సామాజిక కార్యకర్త రౌడీ పిక్చర్స్ అనేది రౌడీ సంస్కృతిని రెచ్చగొడుతున్నందున దానిని నిషేధించాలని పోలీసులను అభ్యర్థించినట్లు తెలిసింది.
ఆ బేనర్ నిర్వాహకులను అరెస్ట్ చేయాలనీ కోరినట్లు తెలిసింది. అయితే ఇలా పేరు పెట్టడంపై సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు ఎంత మేరకు న్యాయం వుందోనని పోలీసు వర్గాలు పరిశీలిస్తున్నారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ తాజాగా అజిత్ సినిమా చేయబోతున్నారు. ఇక నయనతార తెలుగులో గాడ్‌ఫాదర్ సినిమాలో నటిస్తోంది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకుంది.