Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెండు కాళ్లపై ఎదగాలని వస్తే నాలుగు కోళ్ల నవ్వారుపైకి రమ్మంటున్నారు.. లక్ష్మీరాయ్ ఆవేదన

హైదరాబాద్, గురువారం, 18 మే 2017 (03:36 IST)

Widgets Magazine

నటనారంగంలో పేరు తెచ్చుకుని రెండు కాళ్లపై నిలబడి ఒక కెరీర్‌ను నిర్మించుకోవాలని అమ్మాయిలు ఆశతో వస్తే నాలుగు కోళ్ల నవ్వారు మంచంపైకి రావాలంటున్నారని సినీనటి రాయ్ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి డొంకతిరుగుడు మాటలు లేకుండా ఆమె చెబుతున్న మాటల్ని బట్టి,  సినిమా ఫీల్డ్‌లోకి వచ్చిన కొత్త అమ్మాయిలు పడక సుఖం అందించకపోతే అవకాశాలే లేకుండా చేస్తున్నారని బోధపడుతోంది. అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం చిత్ర పరిశ్రమలో ఉనికిలో ఉందని లక్ష్మీరాయ్ తేల్చి చెప్పారు.
Raai Laxmi
 
ఏ రంగంలో అయినా ఎదగాలంటే తమ కెరీర్‌ను కష్టంతో అల్లుకోవాలి. కానీ, ఇక్కడేమో అమ్మాయిల కెరీర్‌ను నవ్వారుతో అల్లేస్తున్నారు. ఎన్నో కలలు, ఆశలతో రంగుల లోకంలో అకాశమంత ఎత్తుకి ఎగరాలని వచ్చినోళ్లను రెండు కాళ్లపై ఎదగనివ్వక నాలుగు కోళ్ల నవ్వారుపైకి రావాల్సిందేనంటున్నారు! ఈ మాటలంటున్నది ఎవరో కాదు... రత్తాలు రాయ్‌ లక్ష్మి. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్‌ కౌచ్‌’ (అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం) ఉందన్నారామె.
 
‘‘కోటి ఆశలతో ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తమ్మాయిలను, హిట్‌ కోసం స్ట్రగుల్‌ అవుతున్న హీరోయిన్లను నిర్మాతలు, ఫిల్మ్‌ మేకర్స్‌ పీడిస్తున్నారు. కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ ఇండస్ట్రీకి సరదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసమే (స్లీప్‌ అరౌండ్‌) వస్తారు’’ అని మొహమాటం లేకుండా ఇండస్ట్రీ తీరును ఎండగట్టారు రాయ్‌ లక్ష్మి. 
 
‘‘తమ సుఖాల కోసం పేరున్న ఆర్టిస్టులను కూడా వీళ్లు వదలడం లేదు. తమతో పడక పంచుకోవడానికి నిరాకరించిన ఆర్టిస్టులను కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ సినిమా నుంచి తప్పిస్తున్నారు’’ అని బోల్డ్‌గా చెప్పేశారీ బ్యూటీ. ‘కాస్టింగ్‌ కౌచ్‌’ అన్ని ఇండస్ట్రీలలోనూ ఉందన్నారు. నిజం చెప్పాలంటే తనకెప్పుడూ అటువంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు. 
 
కొన్ని దశాబ్దాలుగా చిత్రసీమలో అమ్మాయిలకు కలుగుతున్న దారుణమైన అనుభవాలను సమాజం కథలుకథలుగా చెప్పుకుంటూనే వస్తోంది. అవన్నీ సత్యం కాదని, పుకార్లు అని, ఎవరొ కొందరు సృష్టిస్తున్న గాలి పోగు వార్తలు అని బయటి సమాజం భావించేది. కానీ లక్ష్మీరాయ్ మాటలు వింటూంటే అవి పుకార్లు కాదని, కళ పేరుతో అమ్మాయిల శరీరాలతో మాంస వ్యాపారం చేసేవారు చిత్రసీమలో కొనసాగుతున్నారని స్పష్టమవుతోంది.

కెరీర్ కోసం శరీరాన్ని ఫణంగా పెట్టవలసి వస్తున్న యువతుల పట్ల కాస్త జాలి పడటం సంస్కారం.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వందల కోట్లు పెడతారు నిజమే.. రాజమౌళిలా ఎమోషన్స్ పండించే దర్శకుడు.. ప్రభాస్ లాంటి నిబద్ధ నటులు ఎక్కడ?

భారతీయ చిత్ర సంస్కృతిలో మానవ భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాహుబలి-2 ద్వారా ...

news

'బాహుబలి' వంటి కథలు వద్దంటున్న ఎస్ఎస్.రాజమౌళి.. ఎందుకో తెలుసా?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి 'బాహుబలి 2' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు ...

news

'వైశాఖం' సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది: డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌

వైశాఖం చిత్రం చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందని టాలీవుడ్ దర్శకుడు పూరీ ...

news

బాహుబలి-2కి బాలీవుడ్ ఫిదా.. రణ్‌వీర్ ట్వీట్‌కు జక్కన్న థ్యాంక్స్.. ట్వింకిల్ కన్నా కట్టప్పను..?

"బాహుబలి-2"కి బాలీవుడ్ స్టార్లంతా ఫిదా అవుతున్నారు. రాజమౌళితో పాటు బాహుబలి టీమ్‌కు ...

Widgets Magazine