Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'హంటర్‌'కు లేని అభ్యంతరం 'బాబు'కు ఎందుకు? యాంకర్ శ్రీముఖి హ్యాండిచ్చింది...(BBB Trailer)

మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (10:49 IST)

Widgets Magazine
Babu Baga Busy Movie

దర్శకనటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం "బాబు బాగా బిజీ". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్‌కెళ్లింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులకు దిమ్మతిరిగి పోయిందట. చిత్రంలోని సీన్లు చూడలేకు మహిళా సెన్సార్ సభ్యులు థియేటర్ నుంచి బయటకెళ్లిపోయారట. 
 
ఈ సీన్లు చూసి బిత్తరపోయిన సభ్యులు.. ఈ మూవీలో అసభ్యకర సీన్స్ చాలా ఉన్నాయని, అందువల్ల సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారట. దీంతో చిత్ర దర్శకుడు నవీన్ మేడారం మాత్రం సభ్యులతో వాదనకు దిగారట. 
 
హిందీ చిత్రం 'హంటర్‌'కు రీ-మేక్‌గా తెలుగులో తీసిన రొమాంటిక్ కామెడీ చిత్రమే 'బాబు బాగా బిజీ'. 'హంటర్' చిత్రంలోని సన్నివేశాలకు లేని అభ్యంతరం తెలుగులో మాత్రం ఎందుకన్నది నవీన్ మేడారం సూటి ప్రశ్న. చివరకు ఎలాగోలా ఆ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఓకే చెప్పారట. 
 
కాగా, ఈ చిత్రం మే 5వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, సుప్రియ, తేజస్వి, మిశ్తీ చక్రవర్తి, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటిచారు. మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీముఖి డుమ్మా కొడుతూ దర్శనిర్మాతలకు బాగా హ్యాండిస్తోందట. 
 
ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ శ్రీముఖి పేరుతోనే పబ్లిసిటీ చేయాలని భావిస్తోందట చిత్ర బృందం. ఈ సినిమాలో శ్రీముఖిది ఇంపార్టెంట్‌ రోల్‌. కానీ, నిడివి తక్కువ. అయినా సరే ఆమె ఫోటోలను పబ్లిసిటీకి వాడుకోవాలని ప్లాన్‌ వేసింది సినిమా యూనిట్‌. అయితే శ్రీముఖి స్టిల్స్‌ ఏవీ వారికి అందుబాటులో లేవట. దానికి కారణం సినిమా షూటింగ్‌ తర్వాత శ్రీముఖి వారికి అందుబాటులో లేకపోవడమే. 
 
ఇతర హీరోయిన్లతోపాటే శ్రీముఖికి కూడా స్పెషల్‌ ఫోటో షూట్‌ ఎరేంజ్‌ చేసిందట చిత్రబృందం. అయితే ఆ కార్యక్రమానికి కూడా శ్రీముఖి డుమ్మా కొట్టిందట. వచ్చే నెల చివరి వరకు శ్రీముఖి ఫుల్‌ బిజీగా ఉండడం వల్ల ఆ ఫోటో షూట్‌కు శ్రీముఖి రాలేదట. దీంతో చేసేది లేక ఇతర హీరోయిన్ల ఫోటోలతోనే పబ్లిసిటీ చేస్తోందట సినిమా యూనిట్‌.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఇపుడు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తూ కులకాలని వుంది : సుస్మితా సేన్

సుస్మితా సేన్.. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు. మాజీ విశ్వసుందరి. ఎంతోమందికి కలల ...

news

పవన్‌ కళ్యాణ్‌పై కాదు.. త్రివిక్రమ్‌పై ఉన్న నమ్మకంతోనే ఓకే చెప్పా : అనూ ఇమ్మాన్యూయేల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినెషన్‌లో తెరెకెక్కే చిత్రంలో నటించే ఛాన్స్‌ ...

news

బాహుబలి విజయం ఒక మహా విశ్వాసం.. అతి భారీ చిత్రాలకు అదొక నాంది.. రానా ప్రశంసల వర్షం

బాహుబలి విజయం భారతీయ చలన చిత్ర నిర్మాతల్లో గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచిదని ...

news

బాహుబలి2 రన్ టైమ్ ఇంతనా... మూడుగంటల నిడివి సినిమాను చూసేదెవరు?

బాహుబలి2 సినిమా రన్ టైమ్‌పై గత కొద్ది రోజులుగా నడుస్తున్న చర్చలకు తాళం పడింది. రెండోభాగం ...

Widgets Magazine